Suryaa.co.in

Telangana

ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి

– ఎన్నడైనా ఏదైనా కట్టిన ముఖం అయితే రేవంత్ రెడ్డికి తెలిసేది
-రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలవదు
– రుణమాఫీ విషయంలో ప్రభుత్వానికి డెడ్ లైన్
– దసరా లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి.. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం
– ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నా ఎమ్మెల్యే పదవి వదిలేస్తా
– కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి హరీష్ రావు

సిద్దిపేట: ఏదో సామెత అన్నట్టు పాలేవో నీళ్ళేవో తేలాలంటే కొద్దిగా టైం పడుతది. కెసిఆర్ ఉన్నప్పుడు రైతులు ఏ విధంగా ఉండే. కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఎలా ఉంది అనేది అందరికీ అర్థమైంది. కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు రైతుల పరిస్థితి ఎలా ఉండే. రైతులకు ఎరువు బస్తా కావాలంటే పొద్దున ఐదు గంటలకు చెప్పు లైన్లో పెడితే ఒక్క ఎరువు బస్తా దొరికేది.

రైతులను ఎరువు బస్తాల కోసం లైన్ల నిలబెట్టింది కాంగ్రెస్. కెసిఆర్ ప్రతి ఊరికి ఎరువులను లారీల్లో పంపి రైతులకు అందించారు. కెసిఆర్ రాకముందు కాలిపోయే మోటర్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. కెసిఆర్ వచ్చినంక 24 గంటల కరెంటు ఇచ్చిండు. ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కడుపునిండా రైతులకు కరెంటు ఇచ్చిండు. కాంగ్రెస్ పాలనలో దొంగ రాత్రి కరెంట్ వచ్చేది. కెసిఆర్ 24 గంటలు కరెంట్ అందించాడు.

మళ్ళీ కాంగ్రెస్ పాలనలో కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు. కాంగ్రెస్ ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి ఏదో మీటింగ్ లో అంటున్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు ఎట్లా వచ్చింది ఇప్పుడు ఎందుకు వస్తలేదని కరెంట్ అధికారులను అడుగుతుంది.

కేసీఆర్ ఉండంగా ఫార్మరే ఫస్టు. కరోనా వచ్చినప్పుడు 45 రోజులు లాక్ డౌన్ ఉంటే, గవర్నమెంట్ కి రూపాయి ఆదాయం లేదు. ఐనా కేసీఆర్ రేషన్ కార్డు మీద 1500 రూపాయలు ఇచ్చిండు. బియ్యం పంపిండు అందర్నీ ఆదుకున్నాడు. కరోనా వచ్చినప్పుడు కూడా రైతులకు రైతుబంధు వేసిన ముఖ్యమంత్రి కేసీఆర్.

గవర్నమెంట్ కి ఆమదానం లేకపోయినా ఎమ్మెల్యేల, మంత్రుల జీతాలు బంద్ పెట్టిండు. కానీ రైతులకు మాత్రం రైతుబంధు ఇచ్చిండు. అది కేసీఆర్కు రైతు మీదున్న ప్రేమ. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమైంది? కరోనా లేదు అయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు ఇవ్వడం లేదు.

కెసిఆర్ ఉండగా నాట్లు పడే వరకు రైతుల ఫోన్లలో టింగు టింగ్ అని రైతుబంధు పడేది. ఇప్పుడు నాట్లు అయి, కలుపై, పంటకు మందు కొట్టుడు కూడా అయిపోయింది. పంట కోతకు ఉన్నా, దసరా పండుగ దగ్గరకు వస్తున్నా ఇంకా రైతుబంధు పడలేదు.

మాటలు మాత్రం కోటలు దాటుతాయి. అన్ని వంకర మాటలే కానీ రైతులకు మాత్రం రైతుబంధు వేస్తలేడు రేవంత్ రెడ్డి. రైతుబంధుకు కేసీఆర్ ఉండగా ఎకరానికి 4000 ఇచ్చిండు. మల్ల గెలిస్తే 5000 ఇస్తానని ఇచ్చిండు. మళ్లీ గెలిస్తే 8000 చేస్తా అన్నాడు గెలిస్తే చేస్తుండే.

కాంగ్రెస్ గెలిచి 7,500 రైతుబంధు ఇస్తా అన్నారు. పోయిన యాసంగికి 5000 ఇచ్చిండ్రు. ఈ పంటకు మొత్తానికి ఎగబెట్టారు. రైతులను అప్పుల పాలు చేస్తున్నడు రేవంత్ రెడ్డి. పంట పెట్టుబడి కోసం రైతులు అప్పులు చేసే పరిస్థితి ఏర్పడింది. అబద్ధాలు చెప్పి కుంటి సాకులు చెప్పి ఇప్పటిదాకా రైతులకు రైతుబంధు పైసలు ఇవ్వలేదు.

రాష్ట్రంలో రైతులను ఆగం చేయడం కాదా? కెసిఆర్ ఒక్క సారి కాదు 11 సార్లు రైతుబంధు ఇచ్చిండు. ఊరు ఊరుకి కొనుగోలు కేంద్రాలు పెట్టి టైం కు వడ్లు కొనుడు అయినా, వడ్లను కొన్న పైసలు కూడా మూడు రోజులనే రైతులకు అందించిండు కేసీఆర్. కేసీఆర్ వచ్చినంకనే రైతుల భూముల విలువలు పెరిగినాయి.

కెసిఆర్ రాకముందు ఎకరం 5 లక్షలు కూడా పోకపోయేది. కేసీఆర్ వచ్చినంక 24 గంటలు కరెంటు ఇచ్చి, చెరువులు మంచిగా చేసి రిజర్వాయర్లు కట్టి రెండు పంటలు నీళ్లు ఇచ్చి, రైతు విలువ పెంచిండు. రైతు విలువతో పాటు రైతు భూమి విలువ కూడా పెరిగింది. కాంగ్రెస్ వచ్చింది రైతు విలువ తగ్గించింది.

మిషన్ కాకతీయ తో ప్రతి ఊర్లో చెరువులు మంచిగా చేసుకున్నాం. ఈరోజు ఏ ఊర్లో చూసినా చెరువులు నిండుకుండల్లా ఉన్నాయి. కట్టలు మంచిగా చేసినం. తూములు మంచిగా చేసినం. అలుగులు మంచిగా చేసినం. అందుకనే ఈరోజు ప్రతి ఊర్లో చెరువులు మంచిగున్నాయి.

రేవంత్ రెడ్డి కాళేశ్వరం కూలిపోయింది అంటున్నాడు. వచ్చి రంగనాయక సాగర్, మల్లన్న సాగర్ చూడు రేవంత్ రెడ్డి. కాళేశ్వరం కూలిపోతే నీళ్లు ఎట్లా వచ్చినాయో చూడు. రేవంత్ రెడ్డికి కూలగొట్టుడు తప్ప కట్టుడు తెలవదు. కాలేశ్వరంలో 100 భాగాలు ఉంటాయి. ఒక్క భాగంలో 160 పిల్లర్లలో రెండు పిల్లర్లకి చిన్న పగుళ్లు వచ్చినాయి దానికి కాలేశ్వరం మొత్తం కూలిపోయిందని అబద్ధ ప్రచారం చేస్తున్నాడు.

ఎన్నడైనా ఏదైనా కట్టిన ముఖం అయితే రేవంత్ రెడ్డికి తెలిసేది. 100 భాగాల కాలేశ్వరంలో మూడు బ్యారేజీలు, 19 పంప్ హౌస్ లు, 18 రిజర్వాయర్లు, సొరంగాలు, కాలువలు, పైపులైన్లు. ఇండ్ల రెండు పిల్లర్లకు మాత్రమే పగుళ్లు వచ్చాయి. మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్ లో నీళ్లు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఈ వానకాలానికి నీళ్లు ఎక్కడి నుంచి వచ్చాయి.?

కెసిఆర్ వచ్చి కాళేశ్వరం కట్టినంక రైతులకు రెండు పంటలు పండుతున్నాయి. ఎరువులకు బాధ లేదు. పంట పెట్టుబడికి బాధ లేదు. పండిన పంటను ఎవరైనా కొంటారా అనే బాధ లేకుండా చేసిండు కేసీఆర్. రైతుబంధును 7500 చేస్తా అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నారు. వడ్లకు బోనస్ ఇస్తామన్నారు.

రైతులకు ఇచ్చిన ఏ హామీ రేవంత్ రెడ్డి నెరవేర్చలేదు. వడ్లకు బోనస్ ఇచ్చిండ్రా? ఎన్నికల అప్పుడేమో వడ్లకు బోనస్ అన్నారు ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. అన్ని పంటలకు బోనస్ అని పెట్టి ఇప్పుడేమో సన్నాలకు మాత్రమే అంటున్నాడు.

దొడ్డు వడ్లు పండించే వాళ్ళు ఎక్కువ. రూపాయికి 90 పైసలు దొడ్డువడ్లు పండిస్తే పది పైసలే సన్నాలు పండిస్తారు. ఎన్నికల ముందు ఇంకెవరైనా రుణం తెచ్చుకోని వాళ్ళు ఉంటే జల్దీ రెండు లక్షల రుణం తెచ్చుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్నారు.

9 తారీకు చేస్తామన్నడు. రెండు రోజుల ముందే అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ఇప్పటివరకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు. రుణమాఫీ మొదటి సంతకంతోనే చేస్తా అని మాటతప్పిండు రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికల్లో నువ్వు ఓటు అడగాలంటే రుణమాఫీ చేయాలని గట్టిగా పట్టుబట్టి నిలదీస్తే.

ప్రతి రైతుకు అన్నమాట ప్రకారంగా రుణమాఫీ చేస్తే, అవ్వ తాతలకు 4000 పెన్షన్ ఇయ్యి అక్కచెల్లెళ్లకు 2500 ఇయ్యి మీరు చెప్పిన ఆరు గ్యారెంటీల అమలు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పిన.

నా ఎమ్మెల్యే పదవి కంటే రైతులకు రుణమాఫీ కావడమే నాకు ముఖ్యం. నా ఒక్కడి ఎమ్మెల్యే పదవి కంటే అవ్వ తాతలకు ₹4,000 పెన్షన్ రావడం నాకు ఆనందం. కాంగ్రెస్ చెప్పిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తే నా ఎమ్మెల్యే పదవి వదిలేస్తా అని సవాల్ చేసిన.పంద్రాగస్టు వరకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు.

మొదలు 49 వేల కోట్లు మాఫీ చేస్తామన్నారు. తర్వాత 31 వేల కోట్లు అన్నారు. చేసిందెంత అంటే 17వేల కోట్లు. నంగునూరులో 11,000 మంది రైతులు అప్పు తెచ్చుకుంటే రుణమాఫీ జరిగింది 5000 మందికి మాత్రమే. రుణమాఫీ అయిన వాళ్ళు తక్కువ కానోళ్లు ఎక్కువ.

హరీష్ రావు ఏడ నిద్రపోతున్నడు రాజీనామా ఎప్పుడు చేస్తావ్ అని అడుగుతున్నారు. నీ గుండెల్లో నిద్రపోతున్న రేవంత్ రెడ్డి. రైతులకు రుణమాఫీ జరిగేదాకా నిన్ను విడిచిపెట్టను. రేవంత్ రెడ్డిని గట్టిగా నిలదీసి సగం రుణమాఫీ జరిగింది. హైదరాబాదులో కూర్చొని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుడు కాదు. నువ్వు చెప్పిన ఏ ఒక్క హామీ రైతులకు నెరవేర్చలేదు.

రేవంత్ రెడ్డిది అంతా మోసం అన్నీ అబద్ధాలే. ఆయన పేరు ఎనుముల రేవంత్ రెడ్డి, ఆయన పనులు చూస్తే ఎగవేతల రేవంత్ రెడ్డి. ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డి. రైతుబంధు ఎగపెట్టిండు, 4000 పెన్షన్ ఎగపెట్టిండు, అక్కచెల్లెళ్లకు 2500 ఎగపెట్టిండు, వడ్లకు బోనస్ ఎగపెట్టిండు, ఉద్యోగస్తులకు డిఏ లు ఎగపెట్టిండు, తులం బంగారం ఎగపెట్టిండు. అందుకే నువ్వు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు ఎగవేతల రేవంత్ రెడ్డివి.

ఇప్పటికైనా రైతులని, ప్రజలను మోసం చేయకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చమని నేను డిమాండ్ చేస్తున్నాను. మీరిచ్చిన హామీలను నెరవేర్చేదాక బీఆర్ఎస్ పార్టీ విడిచిపెట్టదు. దసరా లోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలి. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తాం.

LEAVE A RESPONSE