– మూసీ సుందరీకరణ పేరిట దందా
– హైదరాబాద్ ను వల్లకాడు గా మారుస్తున్నారు
నీళ్ళే లేని నదిలో రివర్ ఫ్రంట్ పెట్టడం ఏమిటి ?
– బీఆర్ఎస్ నేతలు పి .కార్తీక్ రెడ్డి ,చిరుమళ్ల రాకేష్ కుమార్ ,వై .సతీష్ రెడ్డి , గజ్జెల నగేష్, దశరథ్
హైదరాబాద్: మూసీ సుందరీకరణ పేరిట దందా నడుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతలు నిర్ణయించుకోవడం లో విఫలమైంది. రాష్ట్రాన్ని ఎటు వైపు తీసుకెళ్తున్నారో పాలకులకు అర్థం కావడం లేదు. ప్రజలకిచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వానికి శ్రద్ధ లేదు. ప్రజలకు సంబంధం లేని విషయాలకు ప్రాధాన్యతనిస్తున్నారు.
రేవంత్ రెడ్డి హైదరాబాద్ ను వల్ల కాడు గా మారుస్తున్నారు. కేసీఆర్ హయం లో తెలంగాణ సంతోషంగా ఆర్థిక పరిపుష్టి తో ఉండేది. ఇప్పుడు అన్నీ వ్యవస్థలు కుప్ప కూలాయి. టీవీ చానళ్ళు తెరిస్తే ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.
రైతులను మళ్ళీ అడుక్కునే స్థితికి కాంగ్రెస్ సర్కార్ తీసుకొస్తోంది. కేసీఆర్ హాయం లో రైతు నెంబర్ వన్ గా ఉన్నాడు. తినడానికి చద్ది అన్నం లేదు కానీ బిర్యానీ తినిపిస్తా అని రేవంత్ అంటున్నారు. మూసీ సుందరీకరణ పేరిట దోచుకునే కుట్రకు తెరలేపారు. మూసీ సుందరీకరణకు గతం లోనే 16 వేల కోట్ల రూపాయలతో డీపీఆర్ తయారైంది.
లక్షా యాభై వేల కోట్ల రూపాయల అంచనా ఎక్కడ్నుంచి వచ్చిందో మూసీ మీద లక్షన్నర కోట్ల రూపాయలు ఖర్చు పెడితే తిరిగి రాబడి ఎలా వస్తుంది? నీళ్ళే లేని నదిలో రివర్ ఫ్రంట్ పెట్టడం ఏమిటి ? మూసీ లో సెప్టెంబర్ అక్టోబర్ లో తప్ప నీళ్లు ఎపుడూ ప్రవహించవు.
ప్రజలకు మూసీ రివర్ ఫ్రంట్ మీద ఆసక్తి లేదు. నమామి గంగ ప్రాజెక్టు 2400 కిలోమీటర్ల మేర ఉంటుంది. దానికే 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు కాలేదు. పదుల కిలోమీటర్ల లో ఉన్న మూసీ నదికి లక్షా యాభై వేల కోట్లా? 1500 కోట్ల రూపాయలతో మూసీ కి డీపీఆర్ తయారు చేస్తారా?
ఎవరికి టెండర్లు ఇవ్వాలో కూడా రేవంత్ ప్రభుత్వం ముందే నిర్ణయించుకుంది. అసలు మూసీ కి గరిష్ట ప్రవాహ స్థాయి లెక్కలు ఉన్నాయా ? ఉంటే వాటిని బయట పెట్టాలి. పది సంవత్సరాల్లో జరగని విచిత్రాలన్నీ ఇపుడు రాష్ట్రం లో జరుగుతున్నాయి. మూసీ మీద సంపూర్ణ ప్రజాభిప్రాయం జరగాలి. నిర్వాసితుల ఆమోదంతోనే మూసీ సుందరీకరణ జరగాలి.
హైడ్రా తరహా చర్యలు మూసీ మీద జరిగితే హైదరాబాద్ అగ్ని గోళం అవుతుంది. మూసీ వెంట ఉన్న వారికి కేసీఆర్ అండగా ఉంటారు. ఎవరు బెదిరించినా బీ ఆర్ ఎస్ కార్యాలయానికి ఫోన్ చేస్తే వెంటనే స్పందిస్తాం. ముందు రివర్ బెడ్ ,ఎం ఎఫ్ ఎల్ నిర్ణయించండి. మూసీ పరివాహక ప్రాంతం వెంబడి కొత్తగా వస్తున్న నిర్మాణాలు వెంటనే ఆపాలి.
చేతులు తడిపిన వారి జోలికి ప్రభుత్వం వెళ్లడం లేదు ..మధ్యతరగతి వాళ్ళ ఇండ్లనే కూలుస్తున్నారు. మూసీ భాదితులను కూడగట్టి బడా రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థల ముందు ధర్నా చేస్తాం. చెరువులను కాపాడేందుకే హైడ్రా అని కేవలం మూర్ఖులే అంటారు. మూసీ కార్పొరేషన్ కు 50 వేల కోట్లు రూపాయలు ముందు జమ చేసి నిర్వాసితులకు భరోసా ఇవ్వండి.
రాష్ట్రం దివాళా తీసిందని ఓ వైవు సీఎం చెబుతూ లక్షల యాభై వేల కోట్ల తో మూసీ సుందరీకరణ ను ఎందుకు చేపడుతున్నారు? హైడ్రా తో అటెన్షన్ డైవర్షన్ ,మూసీ తో ఫండ్ డైవర్షన్జరుగుతోంది. కూల్చివేతలతో ఏం సాధిస్తారు ? కాళేశ్వరం ప్రాజెక్టు కు లక్ష కోట్లు కూడా ఖర్చు కాలేదు. అంతకు మించి ప్రయోజనాలు వచ్చాయి.
లక్షన్నర కోట్ల మూసీ సుందరీకరణ తో ఎవరికి లాభం ? ప్రభుత్వాన్ని కేసీఆర్ ప్రేమతో నడిపితే, రేవంత్ భయ పెట్టి నడుపుతున్నారు. మూసీ సుందరీకరణతో కాంగ్రెస్ నేతల జేబులే నిండుతాయి. ప్రజలకు ఒరిగేదేమి లేదు. ప్రజలు రేవంత్ సర్కార్ మీద తిరగబడే రోజులు వచ్చాయి.
ప్రజల తరపున కేసీఆర్ మహాశక్తి లా నిలబడి పోరాడతారు. మూసీ ని బ్లాక్ లిస్ట్ లో ఉన్న మెయిన్ హార్ట్ కంపెనీ కి కట్ట బెట్టే ప్రయత్నం జరుగుతోంది.