Suryaa.co.in

Features

ఆదిశంకరాచార్య – స్వామి వివేకానంద

మనకు, మనదేశానికి బుద్ధుడు, సాయిబాబా కాదు కావాల్సింది. మనకు బుద్దుడు, సాయిబాబా ఆదర్శ పురుషులు కాదు, కాకూడదు.
ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద ఈ ఇద్దరూ మనదేశానికి కావాల్సిన మహనీయులు; మహాశక్తులు. ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద మనకు ఆదర్శ పురుషులు.

బుద్ధుడివల్ల సనాతనానికి, ఈ మట్టికి, సమాజానికి, సగటు మనిషికి జరిగిన మంచి అంటూ ఏదీ లేదు. “ఎవ్వరూ బుద్ధుడి (మాట)ని ఆలకించ (విన) లేదు; అందువల్లే బౌద్ధం వచ్చింది” అని జిడ్డు కృష్ణమూర్తి (1981లో) సరిగ్గా చెప్పారు. ప్రపంచం మొత్తం మీద బుద్ధుడు, బౌద్ధం గరించి ఇంత గొప్పగా, ఇంత సరిగ్గా మరెవ్వరూ ఇంత వరకూ చెప్పలేదు. బుద్ధుడు తన ప్రత్యక్ష శిష్యులకే ప్రయోజనకారి కాలేదు.

బుద్ధుడివల్ల ఏ మాత్రం ప్రయోజనాన్ని పొంది ఉన్నా ఆ శిష్యులు ఆయన అవశేషాల విషయంలో వికృతంగా ఘర్షణ పడకుండా మామూలు మనుషుల్లాగా ప్రవర్తించి ఉండేవాళ్లు. బతికున్న రోజుల్లో తన కర్తవ్యాన్ని చెయ్యని, చెయ్యలేని వ్యక్తి బుద్ధుడు. కొందరు భ్రష్టులు తయారవడం తప్పితే బుద్ధుడివల్ల దేశానికి, సమాజానికి ఒరిగిందేమీ లేదు. బుద్ధుణ్ణి అనసరించి కొందరు దేశ దిమ్మరులై, భ్రష్టులై అసాంఘీక శక్తులై మట్టికి వ్యతిరేకంగా ప్రవర్తించే వారు.

బౌద్ధులు చేస్తున్న రాజ్య ద్రోహం భరించలేక పుష్యమిత్ర శుంగుడు బౌద్ధ భిక్షువుల్ని నిర్మూలించే ప్రయత్నం చేశాడు. అటు తరువాత హూన రాజులు కూడా బౌద్ధులు చేస్తున్న అసాంఘీక కార్యక్రమాల నుంచి సమాజాన్ని రక్షించుకోవడానికి బౌద్ధుల్ని, బౌద్ధ ఆరామాల్ని నిర్మూలించారు (నా క్రితం వ్యాసాల్లో అంతర్జాతీయ ఆధారాలతో ఈ విషయంగా వివరణ ఇచ్చాను). అశోకుడు బుద్ధ ఉపాసకుడయ్యాకే కళింగ యుద్ధం చేశాడు.

ఈ దేశంలో మొట్ట మొదటి మతోన్మాద నరమేధం చేసినవాడు బుద్ధ ఉపాసకుడైన అశోకుడే. (నా క్రితం వ్యాసాల్లో అంతర్జాతీయ ఆధారాలతో వివరణ ఇచ్చాను). అశోకుడు రాజుగా ఉన్న కాలంలో కేవలం 41 సంవత్సరాలే బుద్ధుడికి (అప్పటికి బౌద్ధం లేదు) కాస్తంత పరిగణన ఉండేది. అశోకుడు కాలంలో ప్రజా బాహుళ్యంలో బుద్ధుడికి పరిగణించతగ్గ స్థానం లేదు. బుద్ధుడు కాలం నుంచీ ఇప్పటిదాకా మనదేశంలో మహావీరుడికి, జైనానికి ఉన్నంత ప్రజాదరణ బుద్ధుడికీ, బౌద్ధానికీ ఏనాడూ లేనేలేదు.

బుద్ధుడి చుట్టూ బౌద్ధం అన్న వికృతమైన చీకటి అలముకుంది. బౌద్ధులు మన దేశంలో తొలి నుంచీ దేశ, కుటుంబ, సమాజ వ్యతిరేకులు, విరోధులుగానే ఉన్నారు. అసజహమైన ప్రకృతికి, ప్రవృత్తికి బౌద్ధం ఆలవాలం అయిపోయింది. కాలక్రమేణా పలువురు నీచులు, దుష్టులు బౌద్ధ, బుద్ధ వక్రీకరణలతో, అసత్యాలతో మన సమాజంపై దాడి చేస్తూ వస్తున్నారు.

బౌద్ధం వ్యాప్తిలో ఉన్న ఏ దేశమూ చెప్పుకో తగ్గ స్థితిలో లేదు ( ఈ విషయంపై సరైన వివరాలతో నా క్రితం వ్యాసాల్లో సాధికారికంగా తెలియజేశాను). గత కొన్నేళ్లుగా భారతదేశ సామాజిక నిర్మాణంపై వేటు వెయ్యడానికి కొన్ని దుష్టశక్తులకు బుద్ధుడు, బౌద్ధం ఆయుధాలు అయ్యాయి.

బుద్ధుడు చెప్పిన మంచి వైదికానికి కొత్త కాదు; వైదికంలో లేనిది కాదు. బుద్ధుడు చేసిన మంచి అంటూ లేదు. బుద్ధుడు చెప్పిన మంచివల్ల మన సమాజానికి జరిగిన ప్రయోజనం అంటూ లేదు. బుద్ధుడు కేంద్రంగా మన దేశానికి ఎంతో అనర్థం జరిగింది, జరుగుతోంది. బుద్ధుడు, బౌద్ధం అంటూ కొన్ని దుష్ట శక్తులు లోపాయకారీ కారణాలతో దేశ వ్యతిరేక, సామాజిక సామరస్య వ్యతిరేక, హైందవ వ్యతిరేక ప్రయత్నాలు, పన్నాగాలు చేస్తున్నాయి.

బుద్ధుడివల్ల మనం, మన సమాజం, మన దేశం పొందబోయే ప్రయోజనం ఏమీ లేదు. బుద్ధుడివల్ల మనకు, మన సమాజానికి, మన దేశానికి ఏ మేలు జరగలేదు; జరగదు. బుద్ధుడు మనకు ఎంత మాత్రమూ అవసరం లేదు. బుద్ధుడి ప్రతిమలు, బుద్ధుడి పేరుతో జరుగుతున్న వక్రీకరణలు, హాని మనకు వద్దు; వద్దొద్దు.

సాయిబాబా పూర్తిగా అవైదికం లేదా అహైందవం. శతాబ్ది క్రితం వరకూ మన సంప్రదాయంలో, పూజ, ఆరాధనా విధానాల్లో, ఉపాసనలో ఈ సాయిబాబా లేడు. అర్థాంతరంగా, అర్థరహితంగా, అనర్థదాయకంగా మనలో కలిసిన ధర్మ కల్మషం సాయిబాబా. సాయిబాబా, ఓం సాయి, ఓం సాయిరాం వంటివి వైదికానికి జరుగుతున్న మహా అపచారం. సాయిబాబా అవైదికం, అపౌరాణికం, అధార్మికం (నా క్రితం వ్యాసాల్లో సాధికారికంగా వివరణలు ఇచ్చాను) అన్న ఆలోచనన, ‘చదువు’ మనకు తప్పకుండా రావాలి.

మూలం తెలియని ముస్లీమ్ వ్యక్తికి, మనకు తెలియవస్తున్న రూపంలో ఎక్కడా వైదికత్వం, భారతీయ సంప్రదాయం లేని ఒక వ్యక్తికి వైదిక పద్దతులను ఆపాదించి అశాస్త్రీయంగా, అసాంప్రదాయికంగా,‌‌ అధార్మికంగా సాయిబాబా పూజలు, సాయిబాబా అష్టోత్తరాలు, సాయిబాబా గాయత్రీ, సాయిబాబా యంత్రం వంటి వాటితో వైదిక ద్రోహం చెయ్యడం భయంకరమైన పరిణామం. సాయిబాబాకు వైదికానికీ, సాయిబాబాకు సనాతనానికీ ఏ సంబంధమూ లేదు.

(నా క్రితం వ్యాసాల్లో సాధికారికంగా వివరణలు ఇచ్చాను) వ్యక్తిగానూ, వ్యక్తిత్వం పరంగానూ సాయిబాబా ఏ మనిషికీ, ఏ విధంగానూ ఆదర్శమూ, అవసరమూ కాదు. సాయిబాబా మనలో కొందరికి పట్టిన పిచ్చి, అజ్ఞానం, అమాయకత్వం. సాయిబాబా మానసిక రోగమూ, ఉన్మాదమూ అయి మన హిందూత్వానికి పెద్ద దెబ్బగా తగిలే ప్రమాదమూ, మనోభావం అన్న స్థితిని దాటి సాయిబాబా హైందవానికి పెను కీడుగా పరిణమించే అపాయమూ జరగకూడదు.

మన చుట్టూ రకరకాలుగా ఉన్న బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు మన గౌరవాన్ని చాటేవి, నిలిపేవి కావు. బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు మనకు జరిగిన మేలునో, మన ఘనతనో తెలియజేసేవి కావు. బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు మన భారతీయతా ఔన్నత్యానికి, హైందవ లేదా సనాతనత్వ ప్రాముఖ్యతకు ప్రతీకలు కావు.

ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద భారతీయతా మూర్తులు, వైదిక శక్తులు. ఆదిశంకరాచార్య మన భారతీయతను, వైదికతను నిలబెట్టి మనకు ఘనతను చేకూర్చారు. ఆదిశంకరుల పనితీరు, దూసుకుపోయే నైజం, క్రియాశీలకత్వం, ఫలితాల్ని సాధించగలిగే నేర్పు, ఉద్యమస్ఫూర్తి, నిర్మాణాత్మకత, మేధ మనకు ఆచరణాత్మక ఆదర్శం కావాలి.

వివేకానందులవల్లే ఒకదశలో నిద్రాణమైపోయిన భారతీయతా భావం ప్రజ్వరిల్లి మన దేశానికి రాజకీయ, సామాజిక స్వాతంత్ర్యం వచ్చింది అన్న సత్యం మతి స్థిమితం, సరైన ఆలోచన ఉన్నవాళ్లకు బాగా తెలుసు. వివేకానందులు తన ఆధ్యాత్మిక సాక్షాత్కారాన్ని కూడా దేశం కోసం, వైదికత కోసం, సనాతనత్వం కోసం త్యాగం చేసిన మహోన్నతమైన త్యాగి. (నా క్రితం వ్యాసాల్లో సాధికారికంగా వివరణలు ఇచ్చాను) అంతటి త్యాగశీలి ఆధ్యాత్మిక వ్యక్తులలో మరొకరు లేరు. ప్రపంచాన్ని సనాతనం వైపు తిప్పిన మహనీయుడు వివేకానంద స్వామి.

ఇవాళ మన సమాజంలో బుద్ధుడు, సాయిబాబా, మాత్రమే కాదు, వాళ్ల ప్రతిమలు కూడా fashion symbols అయిపోయిన దుస్థితి పెద్దగా కనిపిస్తోంది. మనకు కావాల్సింది పనికిమాలిన, ప్రయోజనం లేని, ఆదర్శనీయం కాని fashion symbols కాదు. మనలో ఉండాల్సింది passion symbols and passion icons. మనకు భారతీయత, సనాతనత్వం కావాలి; మనలో భారతీయత, సనాతనత్వం ఉండాలి.

అప్రయోజకత్వానికి, అపజయానికి చిహ్నం బుద్ధుడు. తప్పుడుతనానికి, అనర్థానికి చిహ్నం సాయిబాబా. ఈ చిహ్నాలు మనకెందుకు? మనకు ఈ చిహ్నాలు వద్దు; వద్దొద్దు. కార్యదక్షతకు, విజయాలకు చిహ్నం ఆదిశంకరాచార్య. సత్ఫలితాలకు, సత్ప్రభావాలకు చిహ్నం వివేకానంద స్వామి. ఇదిగో ఈ చిహ్నాలే మనకు కావాలి. మనకు ఓటమి కాదు విజయం కావాలి; మనకు అమంగళం కాదు మంగళం కావాలి.

ఆదిశంకరాచార్య, వివేకానంద ఈ ఇద్దరూ శిష్ట శక్తులు, విశిష్ట శక్తులు. మన ఇళ్లల్లో, మన కార్యాలయాల్లో, మన ఉద్యానవనాల్లో, మన వ్యాపార స్థలాల్లో ఉండాల్సినవి బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు కాదు. మన ఇళ్లల్లో, మన కార్యాలయాల్లో, మన ఉద్యానవనాల్లో, మన వ్యాపార స్థలాల్లో తప్పకుండా ఉండాల్సినవి ఆదిశంకరాచార్య, వివేకానందుల ప్రతిమలు, రూపాలు. మనం పంచుకోవాల్సింది బుద్ధుడు, సాయిబాబా ప్రతిమలు కాదు, ఆదిశంకరాచార్య, వివేకానందుల ప్రతిమలు. మనం మన చుట్టూనూ, మనలోనూ ఆదిశంకరాచార్య, వివేకానందుల ప్రతిమల్ని, బోధల్ని, ఆచరణల్ని పెంచుకోవాలి.

మూర్ఖత్వానికి, అజ్ఞానికి, చెడ్డతనానికి, కుట్రలకు, భ్రష్టత్వానికి, దాడులకు మనం బలైపోకూడదు. మనం భారతీయులం. మనం మనకు దక్కాలి. మన, మన దేశ, మన సమాజ హితైషులైన, మనకు మేలు చేసిన ఆదిశంకరాచార్యను, వివేకానంద స్వామిని మన గురువులుగా మనం గుర్తించాలి. మనం మరాలి; బుద్ధుడు నుంచి, సాయిబాబా నుంచి మనం బయటపడాలి; మనం పరిణతి చెందాలి.

మనం ఇకనైనా అసత్ నుంచి సత్‌లోకి వెళదాం; మనం ఇకనైనా తమస్సు (చీకటి) నుంచి జ్యోతిలోకి వెళదాం; మనం ఇకనైనా మృత్యువులాంటి నైజాన్ని విడిచి అమృతత్వంలాంటి బుద్ధి లేదా విజ్ఞతలోకి వెళదాం. మనల్ని మనం సరి చూసుకుందాం;
మనల్ని మనం సరి చేసుకుందాం; ఆదిశంకరాచార్యను, వివేకానంద స్వామిని ఆకళింపు చేసుకుని ఆవాహన చేసుకుందాం.

రోచిష్మాన్
9444012279

LEAVE A RESPONSE