Suryaa.co.in

Andhra Pradesh

హిందూ ధార్మిక దేవాలయాలపై కోర్టుల జోక్యం తగదు

  • నేరం జరిగిన ప్రదేశంలో కేసు పై విచారణ చేపట్టకుండా సుప్రీంకోర్టులో విచారణ చేయడం హాస్యాస్పదం
  • హిందూధర్మిక సంస్థల్లో అన్యమత ఉద్యోగస్తులను తొలగించాలని సుప్రీంకోర్టు ఎందుకు ఉత్తర్వులు ఇవ్వలేక పోతుంది
  • బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ

అమరావతి:తిరుమల లడ్డు వివాదాల్లో కల్తీ నెయ్యి విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ మాట్లాడుతూ తిరుమల మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి మరి కొంతమంది కలిసి రాజకీయంగా వేసిన పిటిషన్ పై నేడు విచారణ చేపడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని, పింక్ డైమండ్ విషయంలో కానీ, అన్న ప్రసాదాల విషయంలో కానీ, శ్రీవాణి టికెట్ల విషయాల్లో కానీ భక్తుల మనోభావాలతో గత వైసీపీ ప్రభుత్వం ఆడుకున్నప్పుడు మరి సుప్రీంకోర్టు ఎందుకు కలగజేసుకోలేదని, మరి ఇప్పుడు వైసీపీ నాయకులు ఒక తప్పుడు పిటీషన్ వేయగానే ఎందుకు అంత హడావుడిగా సుప్రీంకోర్ట్ స్పందించిందని, ఇలా విచారణ చేయటం తమ పరిధిలో కాదు కదా కింద హైకోర్టులు, స్థానిక కోర్టులో ఉండగా దేశంలో అత్యున్నత న్యాయస్థానం వాళ్ల పిటీషన్ స్వీకరించిందని శ్రీధర్ ప్రశ్నించారు.

ముఖ్యమంత్రిని కూడా విమర్శ చేస్తూ మాట్లాడటం ఎంతవరకు సబబనీ అభిప్రాయపడ్డారు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎటువంటి ఆధారాలు,రుజువులు ఉంటేనే కదా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విషయంలో గత ప్రభుత్వంలో జరిగిన అవినీతి అక్రమాలు, నెయ్యి కల్తీ గురించి చంద్రబాబు మాట్లాడరని, దీన్ని సుప్రీంకోర్టు తప్పు పట్టటం ఎంతవరకు న్యాయం అని శ్రీధర్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఈవో శ్యామల రావు అందించిన సమాచారం మేరకు, 2 ప్రభుత్వ ల్యాబ్ ల రిపోర్టుల ఆధారంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు గత జగన్ ప్రభుత్వంలో జరిగిన కల్తీ నెయ్యి కాంట్రాక్టు గురించి ప్రజలకు తెలియజేశారు.

తన ప్రభుత్వంలో దేవుని విషయంలో అటువంటి తప్పు జరగకుండా ఉండటం కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలకు తెలియజేశారని, ప్రజల చేత ఎన్నుకోబడి, జరిగిన జరుగుతున్న తప్పును ప్రజలకు వివరించడం అనేది ఒక ముఖ్యమంత్రిగా అది ఆయన నైతిక బాధ్యత అని శ్రీధర్ తెలిపారు. ముఖ్యమంత్రికి మనోభావాలు ఉండకూడదని సుప్రీంకోర్టు అభిప్రాయమా అని శ్రీధర్ ప్రశ్నించారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం పోయేలా హైకోర్టు,కింది స్థాయిలో విచారించాల్సిన పిటిషన్లను దేశ అత్యున్నత న్యాయస్థానం విచారించటం అనేది తన క్రింది కోర్టులను అవమానించడమేనని, చట్ట ప్రకారం నేరం జరిగిన ప్రదేశంలో విచారణ చేయకుండా ఢిల్లీలో విచారణ చేయటం ఏంటని శ్రీధర్ ప్రశ్నించారు.

ఇప్పటికైనా సరే పిటిషనర్లు పరిగెత్తుకుంటూ సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారనేది న్యాయమూర్తి ప్రశ్నించకపోవడం న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిల్లుతుందని. తప్పుడు పనులు చేసే వారికి న్యాయ వ్యవస్థ సహకరించటం విడ్డూరంగా ఉందని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. సిట్ కరెక్ట్ గా విచారించదేమో అని సుప్రీంకోర్టు అనటం రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థల్ని అవమానించటమేనని శ్రీధర్ అభిప్రాయపడ్డారు. మరి గతంలో వైయస్ జగన్ ప్రభుత్వం తిరుమల చేసిన అవినీతి అవకతవకలపై కూడా సుప్రీంకోర్టు విచారణ చేపడుతుందా అని శ్రీధర్ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలు తమ పరిధిని దాటితే దేశ ప్రజాస్వామ్యానికే ప్రమాదమని శ్రీధర్ అభిప్రాయపడ్డారు.

అలానే దేశంలో అనేక హిందూ ధార్మిక సంస్థల్లో అన్యమత ఉద్యోగస్తులు ఉద్యోగాలు చేస్తున్నారని, అలానే తిరుమలలో కూడా కొన్ని వేల మంది అన్యమత ఉద్యోగస్తులు పనిచేస్తున్నారని మరి ఇది హిందూ ధార్మిక చట్టానికి వ్యతిరేకంగా ఉంటే మరి సుప్రీంకోర్టు ఇంతవరకు దీనిపైన ఎందుకు విచారణ చేపట్టలేదని శ్రీధర్ ప్రశ్నించారు. బిజెపి జాతీయ నాయకుడు సుబ్రహ్మణ్యస్వామికి, వైయస్ జగన్మోహన్ రెడ్డికి లాలూచీ తోనే ఈ పిటిషన్ సుప్రీంకోర్టులో దాఖలు చేశారు.

జగన్ ఇచ్చే ప్యాకేజీల కోసమే సుబ్రమణ్య స్వామి ఈ వయసులో కూడా తహతలాడుతుంటారని, జగన్ చేసిన క్విడ్ ప్రోకో అవినీతి మీద ఒక్కరోజు కూడా సుప్రీంకోర్టులో సుబ్రమణ్య స్వామి పిటిషన్ ఎందుకు వేయలేదని శ్రీధర్ సుబ్రహ్మణ్య స్వామినీ ప్రశ్నించారు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ కూటమి మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వంపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న తిరుమల విషయంలో వెంటనే జోక్యం చేసుకొని స్వామివారికి అపచారం చేసిన, కల్తీ నెయ్యి దోషులను గుర్తించేందుకు కోసం సిబిఐతో విచారణ చేయించాలని శ్రీధర్ డిమాండ్ చేశారు. దేశంలో ఉన్న చర్చిలు, మసీదులు అంశాల్లో కూడా సుప్రీంకోర్టు ఇలానే జోక్యం చేసుకుంటుందా అని శ్రీధర్ ప్రశ్నించారు. హిందూ సనాతన ధర్మం పై న్యాయవ్యవస్థకు చులకన భావం ఏమైనా ఉంద అని శ్రీధర్ ప్రశ్నించారు. ఈ ప్పటికైనా సుప్రీంకోర్టు ఈ కేసును నేరం జరిగిన ప్రదేశానికి సంబంధించిన విచారణ కోర్టులకు ఈ కేసును ట్రాన్స్ఫర్ చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

LEAVE A RESPONSE