Suryaa.co.in

National

శబరిమల ప్రసాదం అరవన్నంలో కల్తీ

తిరువనంతపురం: శబరిమల ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ వివాదం రేగింది. శబరిమల ప్రసాదం అరవన్నంలో కల్తీ జరిగిందని, అందులో మోతాదుకు మించి క్రిమిసంహారకాలు కలిశాయన్న విషయం బయటకు వచ్చింది.

దీంతో ఇప్పటి వరకు తయారు చేసిన అరవన్నం ప్రసాదం డబ్బాలను ఎరువుగా మార్చనున్నారు. శబరిమల అయ్యప్ప దేవాలయంలో 6.65 లక్షల కంటైనర్లలో ఈ ప్రసాదం నిల్వ ఉంది. వీటిని గత ఏడాదిగా వాడకుండా అలాగే ఉంచేశారు.

ప్రసాదం తయారీలో ఉపయోగించిన యాలకుల్లో ఆమోదించదగ్గ స్థాయి కన్నా అధిక మోతాదులో క్రిమిసంహారకాలు కలిసినట్టు ఆరోపణలు వచ్చాయి. అందువల్లనే అరవన్నం ప్రసాదం పంపిణీని నిలిపివేశారు. అయితే, ‘అరవన్నం’ను పెద్ద మొత్తంలో పారవేయడం అధికారులకు అనేక సవాళ్లను తెచ్చిపెట్టింది.

అటవీ ప్రాంతాల్లో పారవేసేందుకు అధికారుల నుంచి వ్యతిరేకత ఎదురైంది. దీంతో భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండటానికి టీడీబీ దానిని శాస్త్రీయ విధానంలో పారబోసేందుకు టెండర్లను ఆహ్వానించింది.

ఈ టెండర్‌ను కేరళకు చెందిన ఇండియన్ సెంట్రిఫ్యూజ్ ఇంజినీరింగ్ సొల్యూషన్స్ (ఐసీఈఎస్) టెండర్లను దక్కించుకుందని టీడీబీ అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ డీహెచ్‌కి తెలిపారు. వారు కలుషితమైన ప్రసాదాన్ని ఎరువుగా మారుస్తారని తెలిపారు.

LEAVE A RESPONSE