Suryaa.co.in

Telangana

మార్కెటింగ్ లో రేవంత్ ను మించినోడు లేడు

-రేవంత్ కు ఎన్ని నాలుకలు ?
– కోదండరాం సెక్రటేరియట్ వెళ్లి ఖాళీలు గుర్తించి సీఎం కు జాబితా ఇవ్వొచ్చు కదా ?
-మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్

సీఎం రేవంత్ రెడ్డి ,ఆయన మంత్రివర్గ సహచరులు కేసీఆర్ హయం లో ఉద్యోగాలు ఇవ్వలేనట్టు మాట్లాడారు. ఉపాధ్యాయుల నియామకాల ప్రోగ్రాం ను సీఎం రాజకీయ వేదికగా వాడుకున్నారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల ఉద్యోగాలు తీసేస్తే మీకు ఉద్యోగాలు వచ్చాయి అని రేవంత్ రెడ్డి ఉపాధ్యాయుల నుద్దేశించి అన్నారు.

కేసీఆర్ హాయం లో రికార్డు స్థాయి లో ఉద్యోగాలు ఇచ్చాం ..మేము సరిగా చెప్పుకోలేకపోయాం. మార్కెటింగ్ లో రేవంత్ ను మించినోడు లేడు. తన usp రియల్ ఎస్టేట్ అని రేవంత్ తనకు తానే ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకున్నారు. ఆలా చెప్పుకున్న వారు మార్కెటింగ్ లో ఎలా ఉంటారో తెలియదా ?

లక్షా 62 వేల ఉద్యోగాలు కేసీఆర్ హాయం లో ఇచ్చాము. మంత్రులుగా ఉన్న భట్టి ,పొన్నం లకు తెలియక పోతే వారు మంత్రులుగా ఉండటానికి అనర్హులు. కేసీఆర్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలి అని మంత్రులు అడుగుతున్నారు. వారికి తెలియదా? రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రభుత్వ శాఖల్లో ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో నిర్ధారించారా చెప్పాలి.

నిన్న మీరు ఇచ్చిన ఉపాధ్యాయ నియామకాలు కూడా సెప్టెంబర్ 6 ,2023 నాడు ఇచ్చిన నోటిఫికేషన్ కు కొనసాగింపే.కేవలం ఆరు వేల ఉద్యోగాలు నోటిఫికేషన్ లో అదనంగా కలిపారు. కోర్టు కేసులను పరిష్కరించించి కేసీఆర్ ప్రభుత్వమే. అందుకే ఆరవై రోజుల్లో ఉపాధ్యాయ నియామకాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది.

ఇపుడున్న సీ ఎస్ కు అధికారులకు అన్ని విషయాలు తెలుసు. డిసెంబర్ 31 ,2024 లోగా 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి తీరాలి. రిక్రూట్ మెంట్ సైకిల్ లో భాగం గా మొదట ఉద్యోగ ఖాళీలు గుర్తించాలి ..ఆ పనే జరగలేదు. కోదండరాం ఏం చేస్తున్నారు ..సెక్రటేరియట్ వెళ్లి ఖాళీలు గుర్తించి సీఎం రేవంత్ కు జాబితా ఇవ్వొచ్చు కదా ?

నిరుద్యోగులతో సభ పెట్టి ఎన్ని ఖాళీలు ఉన్నాయో రేవంత్ చెప్పాలి. నాకు ఓడిపోతే కేసీఆర్ ఉద్యోగం ఇచ్చారని రేవంత్ మాట్లాడారు. తెలంగాణ ఉద్యమం లో ఆరంభం నుంచి నేను ఉన్నాను. నా చరిత్ర అందరికీ తెలుసు.పదవుల కోసం ఏనాడు పాకులాడలేదు. తెలంగాణ ఉద్యమం పై తుపాకీ పెట్టిన రేవంతా నా గురించి మాట్లాడేది?

నా గురించి సీఎం హేళనగా మాట్లాడారు కనుకే స్పందిస్తున్నా. కేసీఆర్ ఉద్యోగాలు ఇచ్చినా మేము హంగామా ప్రచారం చేసుకోలేదు. మేము ఉద్యోగాలు ఇస్తే నియామక పత్రాలు పోస్టులో వెళ్ళేవి. ఇపుడు ఎల్బీ స్టేడియం లో ఇస్తున్నారు. మేమిచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు ఇచ్చి ప్రచారం చేసుకుంటున్నారు.2 లక్షల ఉద్యోగాలు ఇచ్చాక ప్రచారం చేసుకోండి.

కేసీఆర్ వల్లే తెలంగాణ వచ్చిందన్న రేవంత్ ఇపుడు కొరివి దయ్యం అంటున్నారు. రేవంత్ కు ఎన్ని నాలుకలు ఉన్నాయి ? లక్షా 62 వేల ఉద్యోగాలు కేసీఆర్ నింపలేదని ఆర్థిక మంత్రిగా ఉన్న భట్టి చెప్పగలరా ?

LEAVE A RESPONSE