Suryaa.co.in

Political News

మతం ఓటు

జమ్మూ & కాశ్మీర్ ఎన్నికల్లో అక్కడి ముస్లిం ప్రజలు నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ కూటమికి అధికారాన్ని ఇచ్చాయి. ఇస్లామ్ మతం ఓటు జమ్మూ & కాశ్మీర్ లో అధికారాన్ని నిర్ణయించింది.

జమ్మూ & కాశ్మీర్ కు ‘ఏ మేలు చేసినా, ఎంత మేలు చేసినా ముస్లిం ఓటు మాత్రం ముస్లిం భావజాలానికే పడుతుంది’ అని ఈ ఫలితాలు తెలియజేయడం లేదా?

గత పదేళ్ల కాలంలో అక్కడి ముస్లిం ప్రజలకు.. భారత ప్రజా ప్రభుత్వం బీ.జే.పీ. ఎంతో, ఎన్నో చేసింది. అయినా అక్కడి ముస్లిం లు బీ.జే.పీ.కి అధికారాన్ని ఇవ్వలేదు. భారతదేశంలోని పెద్దశాతం ప్రజలైన హిందువులు కడుతున్న పన్ను డబ్బుతో, దేశంలోని ముస్లింలకు ఎన్నో మేళ్లు, ఎంతో లబ్ది జరుగుతూనే ఉంది.

బీ.జే.పీ. ప్రభుత్వం గత పదేళ్లలో ముస్లింలకు ఏ లోటూ చెయ్యలేదు. ముస్లింలు లబ్ధి పొందుతున్న ఏ ప్రభుత్వ పథకాన్ని బీ.జే.పీ. ప్రభుత్వం రద్దు చెయ్యలేదు. బీ.జే.పీ.వల్ల ముస్లింలకు ఏ నష్టమూ రాలేదు. అయినా ముస్లింలు బీ.జే.పీ.కి ఓటు వెయ్యరు. అందుకు కారణం బీ.జే.పీ. హిందుత్వమే; బీ.జే.పీ. జాతీయతా వాదమే.

హిందుత్వం వల్ల వస్తున్న లబ్దిని సమృద్ధిగా పొందుతున్న ముస్లీమ్ ప్రజ.. హిందుత్వాన్ని, జాతీయతా వాదాన్ని, స్వదేశం అన్న భావాన్ని సహించదా? మతం… మతం… మతం… మతమే ముఖ్యమా ముస్లీములకు?

ముస్లీముల ఓటు ఏకీకృతమై జమ్మూ & కాశ్మీర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు దేశంలోని హిందువులకు ఒక పాఠం కావాలి. హిందువులు ముస్లీముల దగ్గర ‘ఓటు వెయ్యడం’ నేర్చుకోవాలి. ముస్లీములలా హిందువులు కూడా, ఏకీకృతమై తమ ఓటును హిందూత్వ పార్టీలకే వెయ్యాలి. హిందూత్వ పార్టీలను గెలిపించాలి.

కేంద్ర, రాష్ట్రాలలో హిందూత్వ పార్టీలు అధికారంలో లేకపోతే, హిందువులకు పెను హాని జరుగుతూనే ఉంటుంది. కేరళ, వెస్ట్ బెంగాల్, కర్ణాటకలలో జరుగుతున్న వాస్తవ సంఘటనల తరువాతైనా హిందువులకు బుద్ధి రావాలి.

హర్యానాలో బీ.జే.పీ.వరుస విజయాన్ని సాధించింది. హర్యానాలో ముస్లీములు జమ్మూ& కాశ్మీర్ లో ఉన్న నిష్పత్తిలో లేరు.

హర్యానాలో వరుస విజయాన్ని సాధించిన బీ.జే.పీ.. జమ్మూ & కాశ్మీర్ లో విజయాన్ని సాధించలేదు. దానికి కారణం ముస్లీమ్ ఓటు. బీ.జే.పీ. హిందుత్వ, జాతీయతా వాద పార్టీ కాబట్టి ముస్లీమ్ ఓటు బీ.జే.పీ కి పడదని స్పష్టంగా తెలుస్తోంది. హిందూ ఓటర్లు సరిగ్గా ఈ విషయాన్నే తెలుసుకోవాలి.

ముస్లీమ్ ఓటుతో జమ్మూ & కాశ్మీర్ లో గెలుపొందిన కూటమి పాలన, ఎంత మత మయంగా ఉండబోతోందో మనం రానున్న రోజుల్లో చూడనున్నాం.

ఈ దేశంలో ముస్లీమ్ ఓటు ఏకీకృతమైనట్టుగా, హిందూ ఓటు కూడా ఏకీకృతం అవాలి. హిందూ ఓటు ఏకీకృతం కాకపోతే, హిందూ ఓటు ఏకీకృతమై హిందుత్వ పార్టీలు అధికారంలో ఉండకపోతే.. ఈ దేశంలో ప్రతి రాష్ట్రమూ వెస్ట్ బెంగాల్, కేరళ, పంజాబ్ అవుతుంది. కేంద్రంలో జాతీయతా వాద, హిందుత్వ పార్టీ బీ.జే.పీ. అధికారంలో లేకపోతే మనదేశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవుతుంది.

మన దేశాన్ని నిలుపుకోవాల్సిన అవసరం హిందువులకే ఉంది. ఈ దేశం నిలబడకపోతే హిందువులకు నెలవు ఉండదు. హిందువులం ముస్లీములను చూసి ఓటు వేయడం నేర్చుకుందాం. హిందువులం మనం ఏకీకృతం అవుదాం. రానున్న ఎన్నికలన్నిటిలోనూ హిందుత్వ పార్టీలను గెలిపించుకుందాం.

“మన హిందువులది మతవాదం కాదు. హిందువులమైన మనది దేశ హిత వాదం”

రోచిష్మాన్
– 9444012279

LEAVE A RESPONSE