Suryaa.co.in

Andhra Pradesh

పల్లెలే దేశానికి పట్టు కొమ్మలు

  • గ్రామాల అభివృద్దే కూటమి ప్రభుత్వ లక్ష్యం
  • సీఎం బాబుతోనే పల్లెలకు పూర్వ వైభవం గ్రామాల్లో రోడ్లకు మహర్దశ

మహాత్మగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రాలకు జీవం పోషిందని రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు .సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజక వర్గం పెనుకొండ మండలము రాంపురం పంచాయతీ మరువపల్లి గ్రామం లో 86 లక్షల నిధులతో ,పలు అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన మంత్రి సవిత.

అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు పాలనతోపల్లెలకు పూర్వ వైభవం తెచ్చేందుకే పల్లె పండుగ పేరుతో పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలలోపల్లె పండుగ కార్యక్రమాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరిగిందన్నారు.

మొదటి దఫా పనులను వీలైనంత త్వరగా పూర్తిచేయాలన్నారు. త్వరలోనే రెండవ దఫా నిధులను కేటాయించి గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ఎంతగానో కృషి చేస్తున్నారన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటినుండే ప్రణాళికలు సిద్ధం చేశారని తెలిపారు

సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగానే సంక్రాంతి కి ఉచిత గ్యాస్ సిలిండర్లు, జనవరి నెలలో తల్లికి వందనం, మార్చి నెలలో అన్నదాత సుఖీభవ వంటి పథకాలను కూడా అమలు చేయడం జరుగుతుందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజల సమస్యలను దృష్టిలో ఉంచుకొని మరిన్ని సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి బాటిలో నడిపించడం సీఎం చంద్రబాబుకే సాధ్యమన్నారు.

గత ప్రభుత్వ తప్పిదలవల్ల రాష్ట్రం పూర్తిగా అభివృద్ధికి నోచుకోలేక అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందన్నారు. గ్రామ పంచాయతీలలో సర్పంచులకు అధికారం లేకుండా చేయడమే కాకుండా కుంటుపడిన అభివృద్ధికి వారిని బాధ్యులను చేసింది, మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రామనికి సర్పంచ్లకు పూర్తిగా అధికారమిచ్చి సర్పంచుల గౌరవం ఇచ్చింద న్నారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నికి భారీగా నిధులు కేటాయించి జీవం పోషిందనారు.ఈ కార్యక్రమంలో మండల అధికారులు, టీడీపీ ,జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE