Suryaa.co.in

Andhra Pradesh

ముగిసిన పల్లె పండగ

– ఇక ప్రగతి పనులు చేపట్టడమే
– చివరి రోజున ఊరూరా సందడి
– పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయం
– ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ: పల్లె ప్రగతికి కూటమి ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య అన్నారు. పల్లె పండుగలో భాగంగా మండలంలోని అడవి రావులపాడు రూ. 20 లక్షలు, లింగాలపాడు లో రూ. 25 లక్షలు, తక్కెళ్ళపాడు గ్రామంలో రూ.20 లక్షలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

ఈ క్రమంలో తంగిరాల సౌమ్య మాట్లాడుతూ, ఊరూరా.. వేడుకగా జరిగిన పల్లె పండగ వారోత్సవాలు ముగిశాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు వారం రోజులపాటు కార్యక్రమాన్ని నిర్వహించిందన్నారు . నియోజకవర్గంలోని అన్ని పంచాయతీల్లో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు శ్రీకారం చుట్టారన్నారు.

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో మెటీరియల్ కాంపోనెంట్ నిధులతో పెద్దఎత్తున సిమెంటు రహదారులు, కాలువలు, నల్లకంకర రోడ్డు డ్రెయిన్ల నిర్మాణాలు, ఉద్యాన, వ్యవసాయ కుంటలు, గోకులాలు, ప్రహరీలు తదితర పనులకు భారీగా ప్రభుత్వం నిధులు కేటాయించిందన్నారు.

గ్రామ పంచాయతీల పరిధిలో గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం శంకుస్థాపనలు, భూమి పూజలు జోరుగా పండగ వాతావరణంలో నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కూటమి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

LEAVE A RESPONSE