Suryaa.co.in

Andhra Pradesh

అమ‌రావతి నిర్మాణానికి నిధులిచ్చేందుకు ముందుకొస్తున్న సంస్థ‌లు

  • ఏపీ సీఆర్డీయేకు 11వేల కోట్ల రుణం మంజూరుకు హడ్కో అంగీకారం
  • ఢిల్లీలో హ‌డ్కో అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపిన మంత్రి నారాయ‌ణ‌
  • ఇప్ప‌టికే అమ‌రావ‌తికి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు వ‌ర‌ల్డ్ బ్యాంక్ అంగీకారం
  • కూట‌మి ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కంతో రుణాలిచ్చేందుకు ముందుకొస్తున్న బ్యాంకులు,సంస్థ‌లు

రాష్ట్ర రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణంలో వేగంగా ముందుకు అడుగులు వేస్తున్నకూట‌మి ప్ర‌భుత్వానికి అన్నీ శుభ‌శ‌కునాలే. అమ‌రావ‌తిని ప్ర‌పంచంలోనే నెంబ‌ర్ వ‌న్ సిటీగా రూపుదిద్దాల‌నుకుంటున్న సీఎం చంద్ర‌బాబు ల‌క్ష్యాల‌కు అన్ని విధాలుగా స‌హాయ‌స‌హ‌కారాలు అందుతున్నాయి..అమ‌రావ‌తి నిర్మాణం కోసం వివిధ బ్యాంకులు,సంస్థ‌లు త‌మ స‌హ‌కారం అందించేందుకు అంగీక‌రిస్తున్నాయి.

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప‌ట్టుద‌ల‌,మున్సిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయ‌ణ కృషితో అమ‌రావ‌తి నిర్మాణానికి వ‌డివ‌డిగా అడుగులు ముందుకు ప‌డుతున్నాయి. ఇప్ప‌టికే గ‌త శ‌నివారం అమ‌రావ‌తి పునఃనిర్మాణ ప‌నుల‌ను ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్రారంభించారు..రాజ‌ధానిలో భ‌వ‌నాలు,ఇత‌ర మౌళిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు సంబంధించి నిర్ధేశిత గ‌డువును పెట్టుకుని ముందుకెళ్తుంది స‌ర్కార్.

రాజ‌ధాని నిర్మాణానికి ఏపీసీఆర్డీఏకు 11 వేల కోట్లు రుణం ఇవ్వ‌నున్న హ‌డ్కో

రాజ‌ధాని నిర్మాణంలో ప్ర‌భుత్వ భ‌వ‌నాల కాంప్లెక్స్,ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతుల‌కు ఇచ్చిన రిటర్న‌బుల్ ప్లాట్ల‌లో మౌళిక వ‌స‌తులు అభివృద్ది,రోడ్లు,డ్రైనేజి,తాగునీటి స‌దుపాయం వంటి ట్రంక్ ఇన్ ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ వంటి మిగిలిన పనుల పూర్తికి 50 వేల కోట్ల ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచనా వేసారు..అయితే వీటిలో మొద‌టి విడ‌త ప‌నుల పూర్తికి 26 వేల కోట్లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అంచ‌నా వేసారు..ఈ నిధుల స‌మీక‌ర‌ణ కోసం కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి రాగానే దృష్టిసారించింది.

ఇప్ప‌టికే ప్ర‌పంచ బ్యాంకు,ఆసియా డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు క‌లిసి 15 వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి…ఇక మిగిలిన 11 వేల కోట్ల నిధుల మంజూరుకు హ‌డ్కో అంగీకారం తెలిపింది. న్యూఢిల్లీలో ప‌ర్య‌టించిన మున్సిప‌ల్ మ‌రియు ప‌ట్ట‌ణాభివృద్ది శాఖ మంత్రి  నారాయ‌ణ‌,ఆ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనిల్ కుమార్ సింఘాల్ హ‌డ్కో అధికారుల‌తో స‌మావేశ‌మయ్యారు.

ఈ స‌మావేశంలో హౌసింగ్ అండ్ అర్బ‌న్ డెవ‌ల‌ప్ మెంట్ (HUDCO) సీఈవో సంజ‌య్ కుల్ శ్రేష్ట‌,హ‌డ్కో విజ‌యవాడ రీజిన‌ల్ చీఫ్ బీఎస్ ఎన్ మూర్తి పాల్గొన్నారు..అమ‌రావ‌తి నిర్మాణానికి సంబంధించి ప్ర‌భుత్వ ఆలోచ‌న‌ను హ‌డ్కో అధికారుల‌కు పూర్తి స్థాయిలో వివ‌రించారు మంత్రి నారాయ‌ణ‌…ప్ర‌భుత్వ ప్ర‌తిపాద‌న‌ల‌కు సంతృప్తి చెందిన హ‌డ్కో సీఈవో అమ‌రావతి నిర్మాణం కోసం ఏపీసీఆర్డీయేకు 11 వేల కోట్ల రుణం మంజూరుకు అంగీకారం తెలిపారు…

రుణం మంజూరుతో వేగ‌వంతంగా అమ‌రావ‌తి నిర్మాణం

అమ‌రావ‌తి ఫేజ్ – 1 నిర్మాణానికి 26 వేల కోట్ల ఖ‌ర్చ‌వుతుంద‌ని ప్ర‌భుత్వం అంచ‌నా వేసింది..ఈ నిధుల‌కు సంబంధించి ఇప్ప‌టికే ప్ర‌పంచ బ్యాంకు,ఆసియా డెవ‌ల‌ప్ మెంట్ బ్యాంకు 15వేల కోట్ల రుణం ఇచ్చేందుకు అంగీకారం తెలిప‌గా…తాజాగా హ‌డ్కో కూడా 11 వేల కోట్ల రుణం మంజూరుకు అంగీకారం తెలిపింది..అంటే మొత్తం 26 వేల కోట్ల నిధులు స‌ర్ధుబాటు అయిన‌ట్లే.,.,.ఈ నిధులు విడుద‌ల అయితే రాజ‌ధాని ప‌నులు వేగంగా ముందుకు సాగ‌నున్నాయి.

LEAVE A RESPONSE