Suryaa.co.in

Andhra Pradesh

కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్లు మంజూరు

  • గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము
  • అభివృద్ధి పనులపై….ఇరిగేషన్, డ్రైనేజీ శాఖల అధికారులతో సమిక్షించిన ఎమ్మెల్యే
  • ఐదేళ్లుగా కాలువల్లో పూడికతీత పనులు చేయకపోవడంతో రైతులకు ఇబ్బందులు
  • రైతులకు ప్రయోజనం చేకూరేలా….కాలువలను అభివృద్ధి చేయాలి

గుడివాడ: గుడివాడ నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ మరియు డ్రైనేజీ కాలువల అభివృద్ధికి రూ.7.73 కోట్ల నిధులు మంజూరైనట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వెల్లడించారు.

ఇరిగేషన్…డ్రైనేజీ కాలువల్లో చెయ్యనున్న అభివృద్ధి పనులపై అధికారులతో…..ఎమ్మెల్యే రాము తన స్వగృహంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.నెహ్రాలి, మోటూరు ఛానల్, భూమికోడు తదితర కాల్వలు… డ్రైన్లలో జరగనున్న అభివృద్ధి పనుల వివరాలను ఎమ్మెల్యే రాముకు…. అధికారులు తెలియచేశారు.

పూర్తి నాణ్యతతో కాలువల్లో అభివృద్ధి పనులు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే రాము సూచించారు. కాలువల్లో ఇటీవల జరిగిన పనులపై ఎమ్మెల్యే అసంతృప్తి వ్యక్తం చేశారు. నిర్లక్ష్యపూరితంగా అభివృద్ధి పనులు చేస్తే సహించేది లేదని…..బాధ్యతతో వర్కులు జరిగేలా పర్యవేక్షించాలని అధికారులతో ఎమ్మెల్యే రాము అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రాము మీడియాతో మాట్లాడుతూ..ఐదేళ్లుగా కాలువల్లో కూడిక తీత పనులు చెయ్యకపోవడంతో, రైతులు అనేక ఇబ్బందులు పడ్డారని అన్నారు.రూ.6.03 కోట్లతో డ్రైనేజీలు, రూ.1.70 కోట్లతో ఇరిగేషన్ కాలువల్లో పూడికతీత పనులు జరుగునున్నాయని ఎమ్మెల్యే రాము తెలియజేశారు.గ్రామాల్లోని చిన్న చిన్న కాలువల్లో సైతం పూడికతీతలు పనులు జరిగేలా చర్యలు చేపట్టామన్నారు. రైతులకు మరింత మేలు జరిగేలా కాలువలను అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే రాము పేర్కొన్నారు.

ఈ సమావేశంలో గుడివాడ మున్సిపల్ మాజీ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, ఇరిగేషన్ డి.ఈలు భరత్, శ్రీను,డ్రైనేజీ డి.ఈ గణపతి, ఏఈలు కుమార్ ,అనిల్, బేగ్, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE