– “మాచన”కు యు ఎన్ ఓ సూచన
హైదరాబాద్: టుబాకో కంట్రోల్ హీరో మాచన రఘునందన్ మరో అరుదైన గౌరవం దక్కించుకున్నారు.ఈ నెల ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (యు ఎన్ ఓ) వారు”మీ వివరాలను సమర్పించండి” అని అడిగారని వివరించారు.ఇప్పటికే “మాచన” కు డబ్ల్యూ హెచ్ వో గుర్తింపు ఉంది.22 ఏళ్లుగా పొగాకు నియంత్రణ కు రఘునందన్ కృషి చేస్తున్నారు. తెలంగాణ లో ని పలు జిల్లాల్లో 500 గ్రామాల్లో..5000 కిలో మీటర్లు ప్రయాణించి 5 ఏళ్లలో దాదాపు 50,000 మంది కి పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే అనర్థాలను,రఘునందన్ వివరించారు.పంజాబ్ కు చెందిన “సైఫర్” మాచన రఘునందన్ కు టుబాకో కంట్రోల్ హీరో అవార్డు ను ప్రదానం చేసింది. యావత్ భారత దేశంలోనే పొగాకు నియంత్రణ కు ఉద్యమ పథం లో..అలుపెరుగని కృషి చేస్తున్న రఘునందన్ ను “ఒకే ఒక్కడు” గా యు ఎన్ ఓ డబ్ల్యూ హెచ్ వో శ్లాఘించింది.