Suryaa.co.in

Andhra Pradesh

పల్లెపండుగతోనే గ్రామాలు అభివృద్ధి

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న పల్లెపండుగ పంచాయతీ వారోత్సవాలుతోనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు అన్నారు. బుధవారం కపిలేశ్వరపురం మండలం, వెదురుమూడి గ్రామంలో సుమారు 25 లక్షలతో పలు అభివృద్ధి పనులకు స్థానిక నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అంగర గ్రామంలో గ్రామపంచాయితీ వద్ద గత 5 సంవత్సరాలుగా మూతపడి ఉన్న RO వాటర్ ప్లాంట్ ను మరమత్తులు చేసేందుకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

అదేవిధంగా హైస్కూల్ దగ్గర కాలనీకి వెళ్లే దారి గ్రావెల్ రోడ్ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గ్రామాలను అభివృద్ధి పధంలో నడిపించటమే కూటమి ప్రభుత్వం ముఖ్య ఉద్దేశ్యం అని అన్నారు. గత ఐదేళ్లు కాలంలో వైసీపీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి జాడ లేకుండా చేసిందని విమర్శించారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళులాంటివని అన్నారు. పేద ప్రజలు ఆర్ధికంగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశ్యంతో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టటం జరుగుతుందన్నారు. ఫింఛన్లు 3 వేలు నుండి 4 వేలుకు, వికలాంగులుకు 6 వేలు రూపాయిలు పెంచిన ఘనత చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. అనంతరం పడమరఖండ్రిక గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో అమలాపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పుత్సల శ్రీను, బోణం వెంకట శ్రీనివాసు, ఇళ్ళ రాంబాబు, బూరయ్య, మురళీకృష్ణ, చుండ్రు అచ్యుతరామారావు, వల్లూరి సుబ్బారావు, ఎల్లే రాజు, చిట్టూరి సత్తిబాబు, ఎం.వెంకట్రావు, పి.నాగబాబు, గుత్తుల కృష్ణమూర్తి, బొల్లోజు రాంప్రసాద్, త్రిపురశెట్టి నాని, షేక్ కరీం, నిడదవోలు ప్రతాప్ చౌదరి, గుడాల జయబాబు, వాకతిప్ప ఎంపిటిసి కుంచె ప్రసన్నకుమార్, పిల్లా బసరాజు, దానేటి షరత్, కొమ్మిశెట్టి సుబ్బారావు, కొమ్మిశెట్టి రాంబాబు, కవల కృష్ణ, శాకా శ్రీనివాసు, వంగా శ్రీను, కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితర్లు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE