– తమిళనాడులో భక్తుల బంగారాన్ని కరిగించిన స్టాలిన్ సర్కారు
– 30 బిలియన్ డాలర్లు ఖజనాలో వేసుకున్న డీఎంకె సర్కార్
– హిందూ దేవతలను వైరస్, ఎయిడ్స్, కరోనాతో పోల్చిన డీఎంకె
– అదే హిందువుల డబ్బుతో ఖంజానా నింపేసుకునే కక్కుర్తి
– హుండీల్లో డబ్బు, బంగారం వేయవద్దంటూ మొదలైన ప్రచారం
(యోగానంద్)
తమిళనాట డీఎంకె సర్కారులో ఉన్న సీఎం స్టాలిన్ నుంచి ఆయన సన్ వరకూ అంతా నాస్తికులే. ద్రవిడ మంత్రం వారిది. హిందీకి వ్యతిరేకం. నో ఇంగ్లీష్, ఓన్లీ తమిళ్. అంతే కాదు. హిందూమతానికీ వ్యతిరేకమే. అసలు డీఎంకె దృష్టిలో హిందూ దేవతలంటే ఒక వైరస్. ఒక ఎయిడ్స్ లాంటి జబ్బు. ఒక కరోనా. ఆ మాట డీఎంకె మంత్రులే సెలవిచ్చారు. మరి హిందువులంటే అంత వ్యతిరేకత, చులకన ఉన్న పాలకులు.. దేవాలయాల్లో భక్తులు వేసే డబ్బు, బంగారం ముట్టకూడదుకదా? కానీ మతం మతమే. డబ్బు డబ్బేనట.
హిందూమతంపై అంత అక్కసు, విద్వేషం వెళ్లగక్కిన డీఎంకె సర్కారు.. నిస్సిగ్గుగా అదే ఆలయాల్లో భక్తులు సమర్పించిన బంగారాన్ని కరిగించి, దాన్ని కడ్డీలుగా మార్చి, ఖజానాలో వేసుకుంది. దానితో కడుపుమండిన భక్తజనం, అసలు హుండీల్లో డబ్బు, బంగారం వేయవద్దన్న ్రపచారానికి తెరలేపింది. ఏంటీ..నమ్మకం కలగడం లేదా? అయితే ఇది చదవండి.
1977 నుంచి కేవలం తమిళనాడు ప్రభుత్వం దేవాలయాలలో భక్తులు సమర్పించిన సుమారు 500000 ఐదు లక్షల కిలోల బంగారు నగలను స్వాధీనం చేసుకుని, ఆ నగలను కరిగించి కడ్డీలుగా మార్చి, బ్యాంకుల్లో తన పేరు మీద డిపాజిట్ చేసుకుంది. దీని విలువ 250000 లక్షల కోట్లు. 30 బిలియన్ డాలర్లు. ఇది కాక దేవాలయాల మీద వచ్చే ఇతర ఆదాయాలు అదనం.
ఇది ఎవరో చెప్పింది కాదు. స్వయంగా తమిళనాడు అడ్వొకేట్ జనరల్ మద్రాస్ హైకోర్టు ముందు ఒప్పుకున్న సత్యం. హిందూ దేవతలను వైరస్ లుగా, ఎయిడ్స్, కరోనాతో పోల్చిన డీఎంకే ప్రభుత్వం, హిందువులు దేవాలయాల్లో సమర్పించిన బంగారాన్ని ఆదాయాన్ని అప్పనంగా అనుభవిస్తుంది.
ఇది, కేవలం తమిళనాడు రాష్ట్రం వరకే పరిమితమైన అపచారం కాదు. తెలుగు రాష్ట్రాలలోని అన్ని దేవాలయాలు చేసే వ్యవహారమే.
అందుకే, ఇప్పటికైనా, దేవాలయ హుండీల్లో ఒక్క రూపాయి కూడా వేయకండి. ఏ సేవలకు డబ్బులు కట్టకండి ఆ దేవాలయాలలో కొలువై ఉన్న దేవతా మూర్తులను కించపరిచే వ్యక్తులు, పార్టీలకు అవి చేరుతున్నాయి. మానవ సేవే మాధవ సేవ అన్నారు కాబట్టి, మరో రూపంలో సమాజానికి సేవ చేద్దాం.