Suryaa.co.in

Andhra Pradesh

ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం

బహుమతులు అందజేసిన మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు 

పదవ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థిని, విద్యార్థులకు ప్రోత్సాహక నగదు బహుమతులను మాజీ హోంమంత్రి వసంత నాగేశ్వరరావు శనివారం అందజేశారు. మైలవరంలోని బాలుర ఉన్నత పాఠశాలలో ఈ కార్యక్రమం జరిగింది. సరస్వతి ఫౌండేషన్ నిర్వాహకులు కుడుముల తిమ్మారెడ్డి అండ్ సన్స్ ఆధ్వర్యంలో ‘ప్రతిభ పురస్కార అవార్డ్స్’ ను అందజేశారు.

మైలవరం మండలంలో 2023-24 విద్యా సంవత్సరంలో పదవ తరగతిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.15వేల ప్రోత్సాహక నగదు బహుమతిని అందజేశారు. ద్వితీయ స్థానంలో నిలిచిన విద్యార్థికి రూ.10 వేలు, మరో 11 మందికి రూ.3,000 చొప్పున రూ.33 వేలు నగదు బహుమతిని అందజేశారు. మొత్తం 13 మంది విద్యార్థిని, విద్యార్థులకు రూ.58 వేలను అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో ఉన్న స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ప్రతిభ చూపించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థులు సమయస్ఫూర్తి, తెలివితేటలు, కార్యదీక్ష, పట్టుదల, పోటీతత్వం కలిగి ఉండాలన్నారు. ప్రోత్సాహక బహుమతులు అందజేస్తున్న సరస్వతి ఫౌండేషన్ నిర్వాహకులు కుడుముల తిమ్మారెడ్డి అండ్ సన్స్ ను అభినందించారు. అనంతరం వసంత నాగేశ్వరరావు ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జి అక్కల రామ్మోహనరావు (గాంధీ) , ఎన్డీఏ మహాకూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE