రామచంద్రపురం పట్టణం కొత్తూరు ఒకటో వార్డుకు చెందిన పార్వతిని రామాంజనేయమ్మ కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె మెరుగైన వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సాయం చేయాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి , రామచంద్రపురం శాసనసభ్యులు వాసంశెట్టి శుభాష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయనిధికి అర్జీ పెట్టుకున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 1,62,000 మంజూరయ్యాయి. శనివారం రామచంద్రపురం పట్టణం హౌసింగ్ బోర్డ్ కాలనీలోని మంత్రి క్యాంప్ ఆఫీసులో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ మంజూరైన చెక్కును లబ్ధిదారురాలుకు అందజేశారు. చెక్కును అందుకున్న ఆమె సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.