– ఎంపి కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కార్యదక్షతతో రాబోయే ఐదేళ్ల కాలంలో రాష్ట్రం పారిశ్రామికంగా ఎంతో అభివృద్ది సాధించనుంది… అమరావతి రాజధాని ప్రాంతంలోనే కాదు రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఆటో మొబైల్ ఇండస్ట్రీ నుంచి టూరిజం వరకు అనేక పరిశ్రమలు రాబోతున్నాయని ఎంపీ కేశినేని శివనాత్(చిన్ని) అన్నారు. గవర్నర్ పేట లోని ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ట్రైనింగ్ (ఐ.టి.టి ల్యాబ్స్) కంప్యూటర్ ల్యాబ్స్ సోమవారం ప్రారంభించి, మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో చార్టెడ్ ఎకౌంటెట్స్ అవసరం చాలా ఉందన్నారు. ట్యాక్స్ పేయర్స్ తో ప్రభుత్వానికి ట్యాక్స్ చెల్లించే విధంగా బాధ్యత తీసుకున్న చార్టెడ్ ఎకౌంటెట్స్ సమాజానికి ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో టిడిపి ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎమ్.ఎస్. బేగ్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కోశాధికారి దండమూడి శ్రీనివాస్, అర్బన్ మైనార్టీ సెల్ మాజీ అధ్యక్షుడు ఎం.డి.ఇర్ఫాన్, ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా విజయవాడ బ్రాంచ్ చైర్మన్ సీఎ ఎన్.నెట్టా రవికిషోర్, వైస్ ఛైర్మన్ సీఎ కె.నారాయణ, మాజీ ఛైర్మన్ అక్కయ్య నాయుడు, మాజీ ఛైర్మన్ సీఎ వి.నరేంద్రబాబు, మాజీ చైర్మన్ సీఎ జి.శ్రీనివాసరావు, మాజీ ఛైర్మన్ సీఎ కె.పూర్ణ చంద్రరావు, సెక్రటరీ సీఎ యు.జయంత్, ఎస్.ఐ.సి.ఎ.ఎస్.ఎ చైర్మన్ సీఎ వి.పవన్ కుమార్, సీఎ పర్వేజ్, పాల్గొన్నారు.