– ₹10 లక్షల రూపాయల సీఎం సహాయనిధి చెక్ అందజేసిన రాష్ట్ర రవాణా యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
– మంత్రి చొరవతో ముందస్తు ఆరోగ్య సేవలకు ఎల్వోసి మంజూరు.
అమరావతి: వైద్య సేవలలో సామాన్యులకు ఆరోగ్య భద్రత, భరోసా సియం సహాయనిధి అండగా నిలుస్తుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. అన్నమయ్య జిల్లా రెడ్డి వారి పల్లె గ్రామానికి చెందిన సందూరి హేమనందా అనారోగ్యం బారినపడి ప్రయివేట్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స కోసం సీఎం సహాయనిధికి మంత్రి రాంప్రసాద్ రెడ్డి కార్యాలయం నుండి ముందస్తు ఆరోగ్య సేవల నిమిత్తం దరఖాస్తు చేసుకోగా మంత్రి చొరవతో ₹10 లక్షల రూపాయలు మంజూరయ్యాయి.
దీనికి సంబంధించిన చెక్కును రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మంగళవారం సచివాలయంలోని తన క్యాంపు కార్యాలయంలో బాధిత కుటుంబసభ్యులకు అందించారు. అనంతరం కుటుంబ సభ్యులు మంత్రి రాంప్రసాద్ రెడ్డి కి అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు.