Suryaa.co.in

Andhra Pradesh

జగన్‌ అక్రమాస్తుల కేసులో సుప్రీంలో కీలక పరిణామం

ఢిల్లీ: జగన్‌ అక్రమాస్తుల కేసు వ్యవహారంలో సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీజేఐ ధర్మాసనం నుంచి మరో ధర్మాసనానికి పిటిషన్‌ విచారణ మార్పు జరిగింది.

అక్రమాస్తుల కేసులో జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని రఘురామకృష్ణరాజు పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణను హైదరాబాద్‌ నుంచి మరో రాష్ట్రానికి మార్చాలని పిటిషన్ వేశారు. ఈ మేరకు రఘరామ వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. రఘురామ పిటిషన్లపై సీజేఐ జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా ధర్మాసనం విచారణ జరిపింది.

జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నాతోపాటు ధర్మాసనంలో సభ్యుడిగా జస్టిస్‌ సంజయ్‌కుమార్‌ ఉన్నారు. విచారణ ప్రారంభం కాగానే పిటిషన్‌ ఏపీకి చెందిందని జగన్‌ తరఫు లాయర్‌ బెంచ్కి వివరించారు. మారిన పరిస్థితుల్లో కౌంటర్‌ దాఖలుకు కొంత సమయం కావాలని సీబీఐ కోరింది. తమకు కొంత సమయం కావాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోరారు.

జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ‘నాట్‌ బిఫోర్‌ మీ’ అనడంతో పిటిషన్లు మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మరో ధర్మాసనానికి బదిలీ చేశారు. జస్టిస్ అభయ్‌ ఎస్‌ ఓకా నేతృత్వం వహించే ధర్మాసనం ముందుకు డిసెంబర్‌ 2న విచారణకు పంపాలని రిజిస్ట్రీని ఆదేశించారు.

LEAVE A RESPONSE