Suryaa.co.in

Andhra Pradesh

ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుకు వినతి

– మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ ను కోరిన ఎమ్మెల్యే బీవి జయ నాగేశ్వర్ రెడ్డి

అమరావతి: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో సీనియర్ సివిల్ జడ్జి కోర్టును ఏర్పాటు చేయాలని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ ను ఎమ్మెల్యే బి.వి.జయ నాగేశ్వర్ రెడ్డి కోరారు. వెలగపూడి సచివాలయం లోని న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ పెషీ కార్యాలయంలో ఎమ్మిగనూరు న్యాయవాదుల సంఘం ప్రతినిధులతో కలిసి మంత్రి ఫరూక్ ను ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి కలిశారు.

సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటు అవసరం, ఆవశ్యకతలపై న్యాయవాదుల సంఘం ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఎమ్మిగనూరు దివంగత టిడిపి నేత బివి మోహన్ రెడ్డి తో తనకు ఉన్న వ్యక్తిగత అనుబంధం ను మంత్రి ఫరూక్ ఎమ్మెల్యే జయ నాగేశ్వర్రెడ్డి తో పంచుకున్నారు.

ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం ప్రభుత్వంలో బివి మోహన్ రెడ్డి తో కలిసి కీలకమైన మంత్రిత్వ శాఖలకు ప్రాతినిధ్యం వహించడం, ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎన్నో అభివృద్ధి పనులకు సంక్షేమ కార్యక్రమాలకు తామిద్దరం చేసిన కృషిని మంత్రి ఫరూక్ గుర్తు చేశారు. సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఏర్పాటుపై వీలైనంత త్వరగా కార్యాచరణ బద్ధంగా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే జయ నాగేశ్వర్ రెడ్డి కి , న్యాయవాదుల సంఘం ప్రతినిధులకు మంత్రి హామీ ఇచ్చారు.

LEAVE A RESPONSE