Suryaa.co.in

Telangana

ప్రసాద్ ల్యాబ్స్ లో ” ది సబర్మతి రిపోర్ట్” సినిమా తిలకించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: 2002 గుజరాత్ గోద్రాలో అయోధ్య నుంచి వస్తున్న కరసేవకులను సబర్మతి ఎక్స్ ప్రెస్ లో కుట్రపూరితంగా ఒక పథకం ప్రకారం 59మందిని కాల్చి హత్య చేశారు దీనిపై అనేక చర్చలు వాదోపవాదాలు జరిగాయి.

చివరకు నానావతి కమిషన్ ఈ ఘటన ప్రమాదం కాదని, ఇది ప్రి ప్లాన్డ్ గా కొన్ని మూకలు చేశాయని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు కూడా దీనిపై తీర్పు ఇచ్చింది.ప్రజాస్వామ్య వ్యవస్థలో ఫోర్త్ ఎస్టేట్ గా మీడియా దేశంలో చాలా కీలక పాత్ర పోషిస్తోంది మీడియాపై.

యాజమాన్యాలపై సిబ్బందిపై ఒత్తిడి తెచ్చినా నిష్పక్షపాతంగా మీడియా వ్యవహరిస్తోంది
నిజం నిలకడగనైనా బయటపడుతోంది నిజం దాగదు. కాస్త ఆలస్యమైనా వాస్తవాలు ఏదో ఒకరోజు బయట పడతాయి సబర్మతి రైలు దుర్ఘటన విషయంలో కూడా అదే జరిగింది. ఆలస్యమైనా నిజం బయటపడింది.
15 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి ఏం చేస్తానో చూడండి అని కొందరు మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రజలను రెచ్చగొట్టారు. దేశం కోసం ధర్మం కోసం ప్రజలు కూడా ఆలోచన చేయాలి దేశం ఎటు పోతోంది ఏం జరుగుతోంది అనేది కూడా ఆలోచించాలి.

LEAVE A RESPONSE