Suryaa.co.in

Andhra Pradesh

ప్రధాని మోదీతో ముగిసిన పవన్ భేటీ

న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బుధవారం న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో ఏపీకి సంబంధించి పలు కీలక అంశాలపై ప్రధాని మోదీతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్చించినట్లు తెలుస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. తొలిసారి ఢిల్లీలో ప్రధానితో పవన్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధాని మోదీతో భేటీకి ముందు కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్‌తో సైతం పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు. పవన్ వెంట ఎంపీలు వల్లభనేని బాలశౌరి, ఉదయ శ్రీనివాస్‌లు ఉన్నారు. ఇక పార్లమెంట్ భవనంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి.. పవన్‌ను కలిశారు.

పవన్ కళ్యాణ్తన పర్యటనలో భాగంగా మంగళవారం పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. ఈ సందర్బంగా రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, పథకాలకు సంబంధించిన అంశాలు చర్చించారు. ఉప రాష్ట్రపతి జగదీప్ దన్‌ఖడ్‌తో సైతం పవన్ భేటీ అయ్యారు.

LEAVE A RESPONSE