– 9 వరకూ అరెస్టు చేయవద్దని హైకోర్టు ఆదేశం
అమరావతి: అరెస్టుల నుంచి తప్పించుకుంటూ అజ్ఞాతంలోనే ఉంటూ వీడియోలు విడుదల చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మకు హైకోర్టు స్వల్ప ఊరటనిచ్చింది. ఆయనను 9 వ తేదీవరకూ అరెస్టు చేయవద్దని పోలీసులను ఆదేశించింది.
చంద్రబాబు, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ ఫొటోలను మార్ఫింగ్ చేసిన కేసులకు సంబంధించి సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. తనపై నమోదైన కేసులను క్వాష్ చేయాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది.
కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను అందించాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణ 9వ తేదీ వాయిదా వేసింది. 9వ తేదీ వరకు వర్మపై ఎలాంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది.