Suryaa.co.in

Andhra Pradesh

మీరు పిలిస్తే రావాలా ఏంటి?

– అంతా నా ఇష్టం అన్న రాంగోపాల్‌వర్మ
– మళ్లీ అజ్ఞాతం నుంచే వర్మ వీడియో
– పారిపోలేదంటూ బుకాయింపు

హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ మరో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పోలీసుల విచారణను ప్రశ్నిస్తూ చేసిన వీడియో వైరల్ అవుతోంది. కొన్ని రోజుల క్రితం తానెక్కడికి పారిపోలేదని, పోలీసులు విచారణకు పిలిస్తే తాను వెంటనే విచారణకు రావాలా? అంటూ ఎదురు ప్రశ్నిస్తూ రాంగోపాల్ వర్మ ఒక వీడియో విడుదల చేశారు.

‘‘ఎప్పుడో సంవత్సరం క్రితం ట్వీట్ పెట్టాను. అప్పుడు పెట్టానో నాకు నో నాలెడ్జ్.. కానీ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నాయ్. ఎవరు పట్టించుకోనిది వారు ఎందుకు పట్టించుకున్నారు? మనకున్న అనుమానాలను బట్టి యాంటిసిపిటరీ బెయిల్ కోర్ట్ ఇస్తుంది.‌ నాకు బెయిల్ రాలేదు. నవంబర్ 25తేదీన 10 గంటలకు నేను పోలీసులకు రిప్లై ఇచ్చాను’’

‘‘ 20 నిమిషాల్లో పొలీసులు వచ్చారు. అది కూడా మీడియాతో వచ్చారు. నేనప్పుడు డెన్‌లో లేను. కానీ నాపై రకరకాల స్టోరీలు వచ్చాయి. పోలీసులు ఎక్కడా నా కేసు గురించి మాట్లాడింది లేదు. మొత్తం మీడియానే నాపై స్క్రిప్ట్ రాసింది. సోషల్ మీడియాను కంట్రోల్ చేయటం ఎవరితరం అవుతుంది. నేను ట్రంప్‌పై కమలా హారిస్‌పై కొద్ది రోజుల క్రితం మీమ్ పెడితే రకరకాల ఓపినీయన్స్ , కామెంట్స్ వచ్చాయి‌. కానీ దాన్నెవరు పట్టించుకోరు‌‌’’

‘‘ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చిన వార్తకు వాల్యూ ఉంటుంది. నాపై అసత్య ఆరోపణలు ప్రసారమయ్యాయి. నాపై పెట్టింది అఫెన్సీవ్ కేసు. సినిమాకు సెన్సార్ బోర్డ్ ఉంటుంది. ప్రతిది డిసైడ్ చేసి సర్టిఫికెట్ ఇస్తుంది‌. సోషల్ మీడియాకు అది లేదు. ఇది నాకు కాకుండా వేరే వారిపై వార్తలు వచ్చుంటే ఎంజాయ్ చేసేడవాడిని. ఏదైనా నెగిటివ్ థంబ్ ఉంటేనే చూస్తారు. నాపై కావాలనే రకరకాల ప్రాంతాల్లో ఫిర్యాదులు ఇచ్చారు’’ అని రామ్ గోపాల్ వర్మ కామెంట్ చేశారు.

LEAVE A RESPONSE