– రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణభయం
– రాజ్యాంగేతర శక్తులుగా రేవంత్ రెడ్డి సోదరులు
– బిఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రాణభయం ఉన్నది. సీఎం రేవంత్ రెడ్డి మా నాయకుల ఫోన్లతో పాటుగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇతర నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో భయానక పరిస్థితిలు నెలకొన్నాయి. రాజ్యాంగ హక్కులు కాపాడాల్సిన పోలీసులు, సీఎం రేవంత్ రెడ్డికి కొమ్ముకాస్తున్నారు.
గాంధీ భవన్ నుంచి FIR లు నమోదు అవుతున్నాయి. ఆ FIR ఆధారంగా పోలీసులు కేసులు పెడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సోదరులు రాజ్యాంగేతర శక్తులుగా మారుతున్నారు. ఆదిలాబాద్ నుంచి అలంపూర్ దాక, కొడంగల్ నుంచి కోదాడ దాక బిఆర్ఎస్ పార్టీల నాయకుల పై అక్రమ కేసులు పెడుతున్నారు.
ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి హోంమంత్రి, ముఖ్యమంత్రిగా మారిండు. ఇది మన రాష్ట్ర ప్రజల దురదృష్టం. మా పార్టీ నాయకుడు కేటీఆర్ , ఇతర నాయకుల పైన అక్రమ కేసులు పెడుతున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన రైతుల పక్షాన పోరాడుతున్న హరీష్ రావు పైన అక్రమ కేసులు పెడుతున్నారు.
ఈనెల 9 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో .అధికార కాంగ్రెస్ పార్టీని ఉతికి ఆరేస్తామని మమ్మల్ని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. , బిఆర్ఎస్ అడ్డుకుంటుంటే మా పైన అక్రమ కేసులు పెడుతున్నారు. 25 రోజులుగా పట్నం నరేందర్ రెడ్డిని జైల్లో పెట్టారు. కొడంగల్ నియోజకవర్గ ప్రజలకు దూరం చేశారు.
ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన కేసు హాస్యాస్పదం. పాడి కౌశిక్ రెడ్డి ప్రాణాలకు ప్రమాదం ఉన్నదని నాతో అనేక సార్లు చెప్పారు. ఎమ్మెల్యే అరేకపూడి గాంధీ అనుచరులు చంపుతారు అని నాతో అనేక సార్లు చెప్పాడు. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ ACP వెంకట రెడ్డి అపాయింట్మెంట్ తీసుకుని ఫిర్యాదు చేసేందుకు, పాడి కౌశిక్ రెడ్డి బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్ కు వెళ్ళాడు.
ఫోన్ ట్యాపింగ్ , ప్రాణాలకు ప్రమాదం ఉన్నదనీ కౌశిక్ రెడ్డి ఫిర్యాదు చేసేందుకు వెళ్ళాడు.కౌశిక్ రెడ్డి ఫిర్యాదు పోలీసులు తీసుకోలేదు. తీసుకోగపోగా ఆయన పైనే కేసు నమోదు చేశారు. పాడి కౌశిక్ రెడ్డి పైన అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసి బంజారా హిల్స్ పోలిస్ స్టేషన్లో చిత్ర హింసలకు గురి చేస్తున్నారు.
ప్రజా ప్రతినిదు లు కానీ వారికి పోలిస్ శాఖ బందోబస్తు కల్పిస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి పోలీస్ శాఖ రక్షణ కల్పిస్తుంది. ప్రజా ప్రతినిధి అయిన కౌశిక్ రెడ్డికి పోలిస్ శాఖ ఎందుకు రక్షణ కల్పించదు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఇష్టం వచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తిట్టాడు. ఆయన పైన BNS యాక్ట్ క్రింద ఎందుకు కేసు పెట్టడం లేదు? దోపిడీకి వ్యతిరేకంగా బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది….తెలంగాణ తల్లికి జరుగుతున్న అన్యాయం పైన బిఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
పట్నం నరేందర్ రెడ్డి నేరం ఒప్పుకోకున్న, కుట్ర పూరితంగా నేరం మోపారు. తెలంగాణ రాష్ట్రంలో జైళ్లో ఉండాల్సిన సంఖ్యా 7 వేలు మాత్రమే. తెలంగాణ రాష్ట్ర 4 కోట్ల మంది ప్రజలను అరెస్ట్ చేసి ఏ జైల్లో పెడుతావు రేవంత్ రెడ్డి. మా నాయకులను అరెస్ట్ చేసి తెల్లవారుజామున , రాత్రి పూట జడ్జిల ముందు నిలబెడుతున్నారు. కోర్టులు మొట్టికాయలు వేస్తున్న ఈ ప్రభుత్వ వైఖరి మారడం లేదు.
ఈ ప్రభుత్వ వైఖరి పైన రాష్ట్ర ప్రజలు గమనించాలి. మాజీ మంత్రి హరీష్ రావు, జగదీశ్ రెడ్డి, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీ శంభి పూర్ రాజును వెంటనే విడుదల చేయాలని బిఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది. రేవంత్ రెడ్డి నుంచి కౌశిక్ రెడ్డి ప్రాణభయం ఉన్నదనీ అనేక సార్లు నాకు చెప్పాడు. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని ప్రభుత్వం టార్గెట్ చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ అనేది దేశ భద్రతకు సంబంధించిన విషయం. మా నాయకుల ఫోన్లతో పాటుగా, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోన్ ఇతర నాయకుల ఫోన్లు సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు.