Suryaa.co.in

Editorial

‘కాపు’ కాస్తున్న ‘కల్యాణ్’పై బలిజల భగ్గు!

  • అన్ని అవకాశాలూ కాపులకేనా?

  • నాగబాబుకు మంత్రి పదవిపై బలిజల అసంతృప్తి

  • బలిజలకు ఇక అవకాశం ఇవ్వరా?

  • క్యాబినెట్‌లో ఇప్పుడున్న కాపులు చాలరా?

  • పేరు బలిజలది.. పదవులు కాపులకా?

  • బలిజ కార్పొరేషన్ గురించి పట్టించుకోరా?

  • బలిజలను పట్టించుకోరా?

  • బలిజ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఎందుకు సిఫార్సు చేయరు?

  • కూటమి విజయంలో నాగబాబు పాత్ర ఎంత?

  • భగ్గుమంటున్న బలిజ సామాజిక వర్గం

  • కమలంలో కృష్ణయ్య కల్లోలం

  • టీడీపీలో ‘సతీష్’ మంటలు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల ముందు కాపు-బలిజ-ఒంటరి-తూర్పు కాపు వర్గాలు సొంతం చేసుకున్న జనసేనపై.. ఇప్పుడు బలిజలు తిరుగుబాటు బావుటా ఎగురవేస్తున్నారు. జనసేనాధిపతి, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ తన సోదరుడు నాగబాబుకు.. ఎమ్మెల్సీ కాకపోయినా, మంత్రి పదవి సిఫార్సు చేయడమే దానికి కారణంగా కనిపిస్తోంది. 13.4 శాతం ఉన్న బలిజ సామాజికవర్గాన్ని విస్మరించి, మళ్లీ కాపు’ కాయడంతో, బలిజలు భగ్గుమంటున్నారు. దశాబ్దాల నుంచి బలిజల బలాన్ని చూపించి రాజకీయ ప్రయోజనాలు పదవులు సాధించుకుంటున్న కాపులు, మళ్లీ ఇప్పుడు మంత్రి పదవుల్లోనూ మాయోపాయం పన్నారని విరుచుకుపడుతున్నారు.

జనసేన దళపతి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన సోదరుడు నాగబాబుకు.. మంత్రి పదవి సిఫార్సు చేసుకోవడంపై బలిజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఉన్న ఒకే ఒక్క బలిజ ఎమ్మెల్యేకు కాకుండా, సొంత అన్నయ్యకు మంత్రి పదవి సిఫార్సు చేయడాన్ని రాయలసీమ, నె ల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన బలిజ సామాజికవర్గం అసంతృప్తితో రగిలిపోతోంది.

‘‘టీడీపీ,జనసేన నుంచి ఇప్పటికి ఉన్న కాపులు సరిపోరా? ఇంకా ఎంతమంది కాపులకు మంత్రి పద వులిస్తారు? మేం కాపుల పల్లకీ మోయడానికేనా గత ఎన్నికల్లో కూటమికి పనిచేసింది? గతంలో కుటుంబపాలన, బంధుప్రీతిపై ఆవే శంగా మాట్లాడిన పవన్ కల్యాణ్, ఇప్పుడు సొంత అన్నయ్య ఎమ్మెల్సీ కాకపోయినా మంత్రి పదవి ఎలా ఇప్పించుకుంటారు’’ అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

పార్టీలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్ ఒక్కరే జనసేనలో ఉన్న ఏకైక బలిజ ఎమ్మెల్యే అని గుర్తు చేస్తున్నారు. అయినా కూటమి విజయంలో నాగబాబు పాత్ర ఏమిటి? ఎంత అని బలిజ సంఘాల నేతలు ప్రశ్నల వ ర్షం కురిపిస్తున్నారు.

నిజానికి రాష్ట్రంలో కాపులు 12.8 శాతం ఉంటే, 13.4 శాతం ఉన్న తమకు ప్రతిసారీ అన్యాయం జరుగుతోందని, బలిజలు చాలా ఏళ్ల నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాపులు కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలోని బలిజలతో కలిపి.. తాము 24 శాతం అని ప్రచారం చేసుకుని, పదవులు సాధిస్తున్నారని బలిజ సంఘాలు చాలాకాలం నుంచి విమర్శిస్తూ వస్తున్నాయి.

కేవలం ఉభయ గోదావరి జిల్లాల్లో ఎక్కువగా.. కృష్ణాలో కొంతభాగం బలమే ఉన్న కాపులు తమను చూపించి.. మంత్రి, ఎమ్మెల్యే, ఎంపి, కార్పొరేషన్ చైర్మన్ పదవులు పొందుతున్నందున.. ఇకపై తమకు-కాపులకు ఎలాంటి సంబంధం లేదని కాపునాడు కన్వీనర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు డాక్టర్ ఓ.వి.రమణ, గతంలో చేసిన ప్రకటన కాపులలో కలకలం సృష్టించింది. దానితో కాపు నేతలు ఆయనపై విరుచుకుపడగా, అందుకు ప్రతిగా బలిజనేతలు సైతం, కాపులపై యుద్ధం ప్రకటించారు.

బలిజలంఖ్యాబలాన్ని కాపులు తమవిగా చూపించి రాజకీయ ప్రయోజనం పొందే రోజులు పోయాయని, బలిజలను ఆదరించిన వారికే ఓట్లు వేయాలంటూ, గత ఎన్ని ల్లో కాపునాడు న్వీనర్ ఓ.వి.రమణ పిలుపునిచ్చారు. ఆ తర్వాత ఆయన బలిజనాడు నేతలతో కలసి రాయలసీమలో పర్యటించి, బలిజలు కూటమికి ఓట్లు వేసి, వైసీపీని ఓడించాలని బహిరంగ పిలునిచ్చారు.

నిజానికి రాయలసీమలో బలిజలు.. తొలి నుంచీ కాంగ్రెస్ పార్టీకి-ఆ పార్టీలోని రెడ్డకు బద్ధ విరోధులు. టీడీపీ స్థాపించిన తర్వాత ఒకసారి ఎన్టీఆర్ మాత్రమే, బలిజలకు అధికశాతం సీట్లు ఇచ్చారు. కాంగ్రెస్, వైసీపీ కూడా బలిజలను గుర్తించలే దు. గత ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా బలిజలు, కూటమికి జై ఎత్తి జైకొట్టారు. అందుకు కారణం జనసేన కూటమిలో భాగస్వామి కావడమే.

అయితే కూటమిలో భాగస్వామి అయిన జనసేన నుంచి.. బలిజ సామాజికవర్గాకి చెందిన తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాస్‌కు, మంత్రి పదవి వస్తుందని బలిజ సంఘ నేతలు భావించారు. అందుకు విరుద్ధంగా పవన్, తన కాపు వర్గానికే పట్టం కట్టిన తీరు బలిజలను ఆగ్రహానికి గురిచేసింది.

ఇప్పుడు మళ్లీ పవన్ తన సోదరుడు నాగబాబుకు, మంత్రి పదవి సిఫార్సు చేయడాన్ని బలిజలు జీర్ణించుకోలేకపోతున్నారు. పార్టీలో ఉన్న ఏకైక బలిజ ఎమ్మెల్యేకు మంత్రి పదవి సిఫార్సు చేయకుండా, తన అన్నకు పదవి ఇప్పించుకోవడంపై బలిజలు భగ్గుమంటున్నారు. తమను మరోసారి కాపులు నమ్మించి మోసం చేశారని, ఎన్నికల్లో జనసేనను గుడ్డిగా నమ్మి మళ్లీ అవమానం పాలయ్యామని, బలిజ సంఘాల నేతలు విరుచుకుపడుతున్నారు.

సరైన సమయంలో తమ సత్తా ఏమిటో చూపిస్తామని సవాళ్లు విసురుతున్నారు. సాన సతీష్ అభ్యర్ధిత్వాన్ని వ్యతిరేకించడం ద్వారా, నాగబాబుకు మంత్రి పదవి పొందారని బలిజ నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. గతంలో కుటుంబపాలన, బంధుప్రీతిపై పెద్ద పెద్ద మాటలు మాట్లాడిన పవన్..ఇప్పుడు తన అన్నయ్యకే మంత్రి పదవి సిఫార్సు చేయడం ద్వారా.. ‘పవన్ కూడా రాజకీయ అవకాశవాది’ అని ముద్ర వేయించుకున్నార ంటున్నారు.

బీజేపీ.. భలే భలే!

క్రమశిక్షణ, సిద్ధాంతాల మడి కట్టుకున్నామని గొప్పలు చెప్పుకునే బీజేపీ కూడా.. ఎవరేమనుకుంటేం మాకేమిటన్న లెక్కలేనితనం ప్రదర్శించిందని, ఆ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణకు చెందిన ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఎలా ఇస్తారని, బీజేపీ సీనియర్లు నిలదీస్తున్నారు.ఏపీలో పార్టీ గొడ్డుపోయిందా? లేక బీసీలు గొడ్డుపోయారా? ఒకవేళ బీసీలకే ఎంపీ సీటు ఇవ్వాలంటే, ఏపీ బీజేపీలో బీసీ సీనియర్లు కనిపించలేదా? అని నిప్పులు కురిపిస్తున్నారు.

గత ఎన్నికల్లో కూడా బీసీలకు మొండిచేయి చూపిన పార్టీ, ఎంపీ ఎన్నికల ద్వారా వచ్చిన ఈ అవకాశం ఎందుకు దూరం చేసుకుంది? కేవలం ఒక ఎంపీ సీటు కోసం పార్టీ తన మూలసిద్ధాంతాలను పక్కకుబెడుతుందా? అసలు పార్టీలో ప్రాధమిక సభ్యత్వం లేని కృష్ణయ్యకు.. అప్పటికప్పుడు సభ్యత్వం ఇచ్చి, అదే చేత్తో బీ ఫారం ఇచ్చిన నాయకత్వం కార్యకర్తలకు, పార్టీని అభిమానించే సానుభూతిపరులకు ఏం సంతేకాలిస్తుంది?

ఇంతోటిదానికి ఈ సభ్యత్వాలు, మీటింగుల ప్రహనం ఎందుకు? అంటే బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఉత్సవ విగ్రహమేనా? అని బీజేపీ సీనియర్లు విరుచుకుపడుతున్నారు. అసలు కృష్ణయ్య పార్టీకి ఏం సేవలు చేశారని ఆయనకు సీటు ఇచ్చారని నిలదీస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుపై కృష్ణయ్య గతంలో చేసిన విమర్శల వీడియోలను సోషల్‌మీడియాలో విడుదల చేయడం గమనార్హం.

టీడీపీలో ‘సానా’ మంటలు

ఇక టీడీపీ అభ్యర్ధి సానా సతీష్‌పైనా పార్టీలో అసంతృప్తి భగ్గుమంటోంది. ఆయన నామినేషన్‌కు.. ఆ జిల్లా నుంచి ఒకరిద్దరు మినహా మిగిలిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలెవరూ హాజరుకాకపోవడం బట్టి, సతీష్‌కు సొంత జిల్లాలో ఎంత బలం ఉందో స్పష్టమవుతోందని పార్టీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానంగా సానా అభ్యర్థిత్వంపై కరుడుగట్టిన పార్టీ వాదులు, టీడీపీకి కష్టకాలంలో కాపుకాసిన సోషల్‌మీడియా సైనికులు, విశ్లేషకులయితే. సానా సతీష్‌కు ఎంపీ సీటు ఇవ్వడాన్ని దారుణంగా విమర్శిస్తూ పోస్టులు పెడుతున్నారు.

ఎన్టీఆర్ పెట్టిన ఈ పార్టీ ఎటుపోతోంది? ఎటు తీసుకువెళుతున్నారు? కమర్షియల్-కార్పొరేట్ వైపు తీసుకువె ళుతున్నారా? చూసేందుకేనా మేం రాక్షసుడైన జగన్‌పై పోరాడి, పార్టీని అధికారంలోకి తెచ్చుకుంది? అన్నగారు పార్టీపెట్టిన తర్వాత డబ్బున్న వారికెవరికీ సీట్లు ఇవ్వకపోయినా, ప్రజలు పార్టీని గెలిపింంచారు కదా? మరి ఇప్పుడు సీబీఐ-ఈడీ కేసులు, జైళ్లకు వెళొచ్చిన కార్పొరేట్ లాబీయిస్టులకు సీట్లు ఇచ్చి, పార్టీ జెండా మోసే కార్యకర్తలకు ఏం సంకేతం-ఏం సందేశం ఇస్తున్నారు? అంటూ సోషల్‌మీడియాలో పోస్టులతో విరుచుకుపడుతున్నారు.

LEAVE A RESPONSE