– ఉద్యానవన శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు
అమరావతి: ఇక్కడి జరిగిన మొదటి రోజు బుధవారం జరిగిన కలెక్టర్ల సదస్సులో ఉద్యానవన శాఖపై సమీక్ష జరిగింది. ఉద్యాన పంటల ఉత్పత్తిని 15% పెంచాలనే లక్ష్యంగా పెట్టుకున్నాం. 3 లక్షల హెక్టార్లలో సూక్ష్మ సేద్యం, లక్ష ఎకరాలలో ఉద్యాన పంటల సాగు లక్ష్యం పెట్టుకున్నాం. 35,000 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు- 29% ఫలితాలు. హార్టికల్చర్‌లో ఆధునిక సాంకేతికత వాడకంతో మెరుగైన ఫలితాలు. నాణ్యమైన మొక్కల ఉత్పత్తి, సరఫరా. సూక్ష్మ సేద్యం కోసం బడ్జెట్ పెంపు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కంప్యూటరీకరణలో దేశంలోనే అగ్రస్థానంలో పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. ఆక్వా కల్చర్, లైవ్ స్టాక్ దృష్టి పెట్టాలి. పంటలకు తెగుళ్లు రాకుండా నివారణ చర్యలు.. జీరో వేస్ట్ లక్ష్యం. కేంద్ర ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. హార్టికల్చర్ ఉన్న జిల్లాల్లో కోల్డ్ స్టోరేజ్ సౌకర్యాలు మరింత పెంచాలి. అలాగే ఉద్యానవన శాఖపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి ఉత్పత్తిని పెంచాలనే లక్ష్యం. పంటలకు తెగుళ్లు రాకుండా చూడడం ప్రధాన లక్ష్యం.
కేంద్ర ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేయాలి. వ్యవసాయ సహకార సంఘాలను బలోపేతం చేయాలన్న దానిపై చర్చ జరిగింది. అలాగే, సూక్ష్మ సేద్యంలో మొదటి స్థానాల్లో చిత్తూరు, అనంతపురం జిల్లాలు ఉన్నాయని, హార్టికల్చర్‌లో ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకోవాలని చర్చించారు.