Suryaa.co.in

Devotional

హనుమంతుడు వివాహితుడా? అవివాహితుడా?

హనుమంతుడు అవివాహతుడనే చాలామందికి తెలుసు. ఆయన బ్రహ్మచారి అన్నది లోకం నమ్మిక. కానీ ఆయన వివాహితుడేనని శాస్త్రం చెబుతోంది. మరి హతుమంతుడు వివాహితుడా? అవివాహితుడా? ఓసారి చూద్దాం!

ఆయనను సువర్చలా సహిత హనుమ అని పిలుస్తారు. సువర్చలా సహిత హనుమకు కళ్యాణం చేయడం శాస్త్రంలో అంగీకరించారు. ఎందుకంటే గృహస్థాశ్రమంలోకి వెళ్ళకుంటే పెద్దలైనటువంటివారు తరించరు.

శాస్త్రంలో హనుమకు ప్రవర ఉన్నది. తండ్రిగారు కేసరి, తాతగారి పేరు, ముత్తాతగారిపేరు కళ్యాణంలో చెప్తారు. హేమగర్భుడు అని వారి ముత్తాతగారి పేరు. ఒకతండ్రి కడుపున పుట్టిన పిల్లవాడు వివాహం చేసుకోకుండా ఉండిపోతే, తల్లిదండ్రులు దేహములు చాలించిన తరువాత వారి శరీరాలను చెట్లకి త్రిప్పి కట్టేస్తారు.

ఎందుకంటే నువ్వు వివాహం చేసుకోనటువంటి సంసార భ్రష్టుడిని కన్నావు కనుక అని. అందుకని పిల్లలు వివాహం చేసుకోకుండా ఉండకూడదు. అలా చేయడం తల్లిదండ్రులయొక్క ప్రధానమైన బాధ్యత. నవ వ్యాకరణ పండితులు, మహా బుద్ధిమంతుడైన హనుమ వివాహం చేసుకోకుండా అటు సన్యాసం తీసుకోకుండా ఉండరు కదా!

మీకు అందుకే భారతీయ సంప్రదాయంలో ఋషులందరూ వివాహం చేసుకొని ఉంటారు. అలాగే హనుమ కూడా శాస్త్రమునకు సంబంధించినంతవరకు గృహస్థాశ్రమంలో ఉంటారు. కాపురం చేసినట్లు, పిల్లల్ని కన్నట్లు లేదు. ఎందుకంటే ఆయన బ్రహ్మజ్ఞాని. అందుచేత సువర్చలను వివాహం చేసుకున్నారు. ఇద్దరూ యోగమును అనుసంధానం చేశారు.

LEAVE A RESPONSE