– 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఎందుకు వస్తలేడు?
– కేసీఆర్ లాగా దొంగ దీక్ష చేయలేదు
కేటీఆర్, హరీష్ గురుంచి మాట్లాడొద్దని సీఎం కి సూచించా
పబ్లిక్ లో వీళ్ళు ఇద్దరు జోకర్లు
– పాలమూరు నుంచి శ్రీహరి కి కచ్చితంగా మంత్రి పదవి వస్తుంది
– అసెంబ్లీ లాబీల్లో మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చిట్ చాట్
హైదరాబాద్: మళ్లీ అధికారంలోకి వస్తామన్న నమ్మకం కేసీఆర్ కు లేదు. అందుకే అసెంబ్లీ వస్తలేడు. ఐదుగురు ఉన్నపుడు భట్టి విక్రమార్క వచ్చారు. 30 మంది ఎమ్మెల్యేలు ఉన్న కేసీఆర్ ఎందుకు వస్తలేడు? కొడుకు , అల్లుడు, బిడ్డలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
రాజకీయాల్లో హుందాతనం అవసరం. కేటీఆర్, హరీష్ రావు కు అవి లేవు.
డీలిమిటేషన్ లో 34 అసెంబ్లీ సీట్లు, 7 ఎంపీ సీట్లు పెరుగుతాయి. జమిలి డ్రాఫ్ట్ రెడీ అయిందని అంటున్నారు. మా సీఎం , మంత్రులు పబ్లిక్ కి అందుబాటులో ఉంటున్నాము. ప్రతిపక్ష హోదా లేకున్నా ఖర్గే, అదిర్ రంజాన్ చౌదరి పార్లమెంట్ కి వెళ్లారు. బడ్జెట్ సమావేశాల వరకు కౌన్సిల్, అసెంబ్లీ కి రెడీ.
కాంగ్రెస్ లో మంత్రి వర్గ విస్తరణ ఎవరికి పదవులు అనేది ఎవరు చెప్పలేరు. ఈ విషయం పార్టీ అధిష్టానం, సీఎం దే నిర్ణయం. పాలమూరు నుంచి శ్రీహరి కి కచ్చితంగా మంత్రి పదవి వస్తుంది. ఇది చెప్పగలను. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఇందిరాగాంధీ, ఎన్టీఆర్ ఓడారు. కల్వకుర్తి లో ఎన్టీఆర్ మీద చిత్త రంజన్ ఇంట్లో నుంచి గెలిచారు. నా మీద ఎంపీగా గెలిచేందుకు కోట్లు ఖర్చు పెట్టారు బురా నర్సయ్య. అయినా నేనే గెలిచిన.
ప్రతిపక్ష ఎంపీ గా ఎన్నో రోడ్ ప్రాజెక్టులు తీసుకొచ్చిన. గడ్కరీ నిన్న సీఎం కు చెబుతున్నారు వెంకన్న నాకు చోటా బాయ్ అని. బీఆర్ఎస్ వాళ్ళు 10 ఏళ్ల లో ఎన్ని రోజులు అసెంబ్లీ పెట్టారు? మేము ఎన్ని రోజులు అనేది అసెంబ్లీ రికార్డ్ లో ఉంటుంది కదా. ఎన్ని రోజులు అనేది కాదు ఎన్ని గంటలు జరిగింది ఎన్ని చర్చలు జరిగాయి అనేది ముఖ్యం. వాళ్ళ కు ఎవరు భయపడతార?.. ప్రతిపక్ష నేత లేడు.
ఉద్యమం లో ఆయనకి అగ్గిపెట్టే దొరక లేదట. ఊర్లో బీడీ , సిగరెట్ , సుట్ట తాగే వాళ్ళు ఉంటారు. ఎవడ్ని అడిగిన అగ్గిపెట్టే ఇస్తారు. కేసీఆర్ అసెంబ్లీ కి వచ్చి ప్రతిపక్ష నేత పాత్ర పోషించాలి. మంత్రిగా ఏ ప్రశ్నకైనా నేను జవాబు పిస్తా. ప్రజల్లో పరపతిలేని కేటీఆర్, హరీష్ గురుంచి మాట్లాడొద్దని సీఎం కి సూచించా.. అందుకే పాలమూరు, నల్గొండ లో మాట్లాడలేదు. పబ్లిక్ లో వీళ్ళు ఇద్దరు జోకర్లు గా మారారు.
తెలంగాణ ఉద్యమం లో దీక్ష చేసి 17 కిలోలు బరువు తగ్గిన. సావు నోట్లో తల పెట్టింది నేను. కేసీఆర్ లాగా దొంగ దీక్ష చేయలేదు. సర్పంచ్ ల పెండింగ్ బిల్లు లో బిఅరెస్ ఎమ్మెల్యేలు చెప్పిన లెక్కలు తప్పు.