Suryaa.co.in

Andhra Pradesh National

నూత‌న రాజ్య స‌భ స‌భ్యుల‌తో క‌లిసి ఛైర్మ‌న్ ను క‌లిసిన ఎంపి కేశినేని శివ‌నాథ్

ఢిల్లీ : ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్య స‌భ‌కు నూత‌నంగా ఎన్నికైన సానా స‌తీష్ బాబు, బీద మ‌స్తాన్, ఆర్. కృష్ణ‌య్య ల ప్ర‌మాణా స్వీకార కార్య‌క్ర‌మానికి రాజ్య‌స‌భ‌లో ఎంపి కేశినేని శివ‌నాథ్ ఎన్డీయే ఎంపిల‌తో క‌లిసి వీక్షించారు. అనంత‌రం ప్ర‌మాణ స్వీకారం చేసిన ముగ్గురు రాజ‌స‌భ్య స‌భ్యుల‌తో రాజ్య‌స‌భ చైర్మ‌న్ కార్యాల‌యంలో చైర్మన్ జగదీప్ దన్‍ఖడ్, కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాల‌ను మ‌ర్యాద పూర్వ‌కంగా క‌లిశారు.

అనంత‌రం రాజ్య స‌భ ఎంపీలు సానా స‌తీష్ బాబు, బీద మ‌స్తాన్, ఆర్. కృష్ణ‌య్య లకు కేంద్ర పౌర‌విమానాయ‌న శాఖ మంత్రి రామ్మోహ‌న్ నాయుడు తో పాటు ఎంపి కేశినేని శివ‌నాథ్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎంపిలు లావు శ్రీ కృష్ణ దేవ‌రాయులు, సీఎం ర‌మేష్, ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి, హ‌రీష్ మాథుర్, ద‌గ్గుమ‌ళ్ల ప్ర‌సాదరావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, బ‌స్తిపాటి నాగ‌రాజు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE