- ఎంపీగా పనిచేసి ఏమిటా ఉగ్రభాష?
- ఇదేనా మీ బీఆర్ఎస్ పార్టీ స్టాండ్?
- బాల్క సుమన్‌పై రైల్వే పోలీసులు కేసు పెట్టాలి
- రైతు ధర్నాకు రైతులే లేరన్నది నిజం
- బాల్కను పార్టీ నుంచి బహిష్కరించాలి
- లేకపోతే ఇదే మా పార్టీ స్టాండనుకోవాల్సి వస్తుంది
- మాజీ ఎంపీ బాల్క సుమన్ పై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
హైదరాబాద్: ప్రజాస్వామ్యంలో బాధ్యతగా ప్రభుత్వ నిర్ణయాల మీద విభేదించి పోరాటం చేసే హక్కు ఎవరికైనా ఉంది. ఒక పార్లమెంట్ సభ్యుడిగా చేసిన వ్యక్తి జాతీయ సంపద రైల్వే.. రైల్వే పట్టాలు కోసేయాలని చెప్తున్నారు. నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. రాజకీయ ఉన్మాది గా మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత పార్లమెంట్ సభ్యుడిగా, శాసన సభ్యుడుగా చేసిన వ్యక్తి రైలు పట్టాలు కోసేయాలని పిలుపునిచ్చారు. వెంటనే రైల్వే శాఖ తరపున కేంద్ర పోలీసులు అతని మీద కేసులు నమోదు చేయాలి..
చెన్నూరు నాయకులను కోరుతున్న, ఆ వీడియో తో సహా రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సింగరేణి కార్మికులు తల్లి లాంటి సింగరేణి కార్యాలయాన్ని కాల్చేయాలని చెబుతున్నాడు. ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యంగా ఉద్యమాలు చేసుకోవాలని చేస్తున్నాము. కానీ స్వయంగా ఆయనే చెప్తున్నారు. రైతుల ధర్నా కి ఐదుగురు రైతులు రాలేదని, పార్టీ నేతలతో కలిసి ధర్నా చేసినట్టు స్వయంగా ఆయనే చెప్పారు.
నెల రోజులు జైలుకు పోయిన పర్వాలేదు. రైలు పట్టాలు కోసేయి..సింగరేణి భవనాన్ని కాల్చేయి అంటున్నారు.. వెంటనే అతనిని బీఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించాలి. ఇటీవల మున్సిపల్ ఎన్నికల్లో ఆయనే దాడి చేసి.. ఆయన ఏదో అన్యాయం జరిగినట్టు అరెస్ట్ అయి జైల్లో వేస్తే అందరూ వెళ్ళి పరామర్శించి వచ్చారు ..
2 1/2 ఏళ్లు అధికారంలోకి లేకపోతే ఇంత అసహనం గురైతే ఎందుకు తోడ్పడుతుంది.
వెంటనే బీఆర్ఎస్ నాయకత్వం స్పందించాలి. 10 ఏళ్లు అణిచివేస్తే ..అరెస్ట్ లు చేస్తే ధర్నా చౌక్ ఎత్తివేస్తే నిరసనలు తెలిపాము. మేము ప్రజాస్వామికంగా నిరసనలు తెలపాలని చెప్పాం. మేము ఎప్పుడైనా విధ్వంసాలు రెచ్చగొట్టేలా రైలు పట్టాలు కోసేయాలని చెప్పామా? శాంతిభద్రతలకు విఘాతం కలిగేలా చేయడం సరైంది కాదు. వారి నాయకత్వం చూస్తూ ఊరుకుంటే మీ పార్టీ స్టాండ్ గా భావిస్తాం.