Suryaa.co.in

Andhra Pradesh

నిలిచిన ప్రాజెక్టులకు పరుగులు

– 21 అంశాలపై ఏపీ క్యాబినెట్‌లో చర్చ
– వెల్లడించిన సమాచారశాఖ మంత్రి కొలుసు పార్ధసారథి

అమరావతి: గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఇ-క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు.

1.పంచాయితీ రాజ్ & గ్రామీణాభివృద్ది శాఖ
-గత ప్రభుత్వం చాతగాని తనం, అనుభరాహిత్యం మూలంగా రాష్ట్రం ఏవిధంగా నష్టపోయిందో ఈ జలజీవన్ మిషన్ పనులు ఒక ఉదాహరణ
-కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ.26,824 కోట్ల విలువైన 77,917 పనులను రాష్ట్రానికి మంజూరు చేసింది.
-ఈ పథకం క్రింద కొన్ని రాష్ట్రాలు రూ. లక్ష నుండి రూ.1.50 కోట్ల ను తీసుకున్నాయి
-మన కంటే చిన్న రాష్ట్ర మైన కేరళా రాష్ట్రం రూ.70 వేల కోట్ల వరకు తీసుకోవడం జరిగింది.
-మరి మన రాష్ట్ర ప్రభుత్వం రూ.26 వేల కోట్లుకు మాత్రమే ప్రతిపాదనలు పంపిస్తే, రూ.26,824 కోట్లను కేంద్రం కేటాయించగా, అందులో కూడా రూ.4,000 కోట్లను మాత్రమే మన ప్రభుత్వం ఖర్చు చేయడం జరిగింది.
-ఇప్పటి వరకూ కూడా పనులు ప్రారంభించని 25 శాతం కంటే తక్కువైన పనులు రూ.11,400.80 కోట్ల విలువైన 44,195 పనుల ఉన్నాయి
-వాటి టెండర్లను రద్దు చేసి మళ్లీ నూతనంగా టెండర్లను పిలుచేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-అదే విధంగా 33,717 ప్రాజక్టులు వివిధ దశల్లో ఉన్నాయి, వాటన్నింటినీ నిర్థిష్ట సమయంలో మంజూరు చేయడానికి అనుమతి మంజూరు చేయడం జరిగింది.
-వీటిలో ముఖ్యంగా మూడు ప్రాజెక్టులు పులివెందుల, ద్రోణాచలం మరియు ఉద్దానం లో తీవ్ర నీటి ఎద్దడి ఉన్న నేపథ్యంలో ఈ మూడు ప్రాజెక్టులను కొనసాగించి, పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది.
-అస్తవ్యస్తంగా ప్లాన్ చేయబడ్డ జలజీవన్ పనులను అన్నింటినీ కూడా పున: సమీక్షించి అక్కడి ప్రజల అవసరాల కోసం, సస్టైనబుల్ నీటి వనరుల ఆధారంగా ఈ ప్రాజక్టులను అన్నింటినీ రీ-డిజైన్ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది.
-గత ప్రభుత్వం ఎంతో బాధ్యత రహితంగా సస్టైనబుల్ నీటి వనరుల ఆధారంగా ఈ ప్రాజక్టులను డిజైన్ చేయకుండా బోర్లు ద్వారా ఈ ప్రాజక్టులను రూపొందించేందుకు చర్యలు చేపట్టడం జరిగింది.
-ఇది గత ప్రభుత్వం యొక్క బాధ్యతా రాహిత్యానికి ఇది నిదర్శనం

2.పురపాలక & పట్టణాభివృద్ది శాఖ
-గత ప్రభుత్వం మూడు రాజధానులు అంటూ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసింది.
-అయితే ఈ కూటమి ప్రభుత్వం తెలుగు వారు అంతా గర్వపడే విధంగా రాష్ట్ర రాజధాని అయిన అమరావతిని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ది పర్చాలనే నిర్ణయాన్ని తీసుకుంది.
-అందులో బాగంగా ఇప్పటికే ప్రపంచ బ్యాంకు, ఎడిబి బుణాలు మంజూరు చేయడం జరిగింది.
-హడ్కో నుండి రూ.11,000 కోట్లు మరియు జర్మనీ ఫైనాన్సు కంపెనీ అయిన కేఎఫ్‌డబ్ల్యూ నుండి రూ. 5,000 కోట్లు (మొత్తం రూ. 16,000 కోట్లు) మరియు అమరావతి రాజధాని నగర అభివృద్ధికి కావలసిన ఇతర నిధులను సమీకరించడానికి కమిషనర్, ఏపీసీఆర్డీఏ అనుమతివ్వాలని చేసిన ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
-ఈ నిధులతో ఐఏఎస్, గజిటెడ్, క్లాస్ ఫోర్ క్వాటర్ల నిర్మాణానికి మరియు వరద మిటిగేషన్ పనులకు, రహదారులు, మౌలిక వసతుల కల్పనకై 45 ఇంజనీరింగ్ పనులను రూ.33137.98 కోట్లతో చేపట్టడానకి ప్రభుత్వం సిఆర్డిఏకు అనుమతి మంజూరు చేయడం జరిగింది.
-ఏపీ రియల్ ఎస్టేట్ అపిలేట్ ట్రిబ్యునల్‌కు 14 పోస్టుల మంజూరుకు చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

3.రెవిన్యూ శాఖ
-గ్రామకంఠం భూముల సర్వే మరియు రికార్డింగ్ కోసం గత ప్రభుత్వం 6,688 గ్రామాల్లో రీ-సర్వే చేయిస్తే, దాదాపు 1.95 లక్షల గ్రీవెన్సులు ప్రభుత్వానికి అందాయి.
-అందులో 48,899 జాయింట్ ల్యాండ్ పార్సిల్ మ్యాపింగ్ స్లిట్టింగ్ కోసం అంటే సబ్ డివిజన్ చేసేందుకు అర్జీలు వచ్చాయి. వాటిని నిర్థిష్ట సమయంలో సబ్ డివిజన్ చేసేందుకు మరియు రూ.550/- ల ఫీజును కూడా చెల్లించ కుండా చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

4.రెవిన్యూ శాఖ
-చిత్తూరు జిల్లా శాంతిపురం (మండలం) తమ్మిగానిపల్లె (గ్రామం)లో ఎల్‌పిఎం నెం. 436 కింద నూతన కృషి విజ్ఞాన కేంద్రాన్ని స్థాపించడానికి 50.21 ఎకరాల ప్రభుత్వ భూమిని రిజిస్ట్రార్ ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయానికి జీవో. ఎంఎస్. నెం.571, తేదీ: 14.09.2012 ప్రకారం సాధారణ షరతులకు లోబడి, ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

5.రెవిన్యూ శాఖ
-కర్నూలు జిల్లా రూరల్ మండలం బి.తాండ్రపాడు గ్రామంలోని ఎల్పీఎం నెం.465 క్రింద ఉన్న 5 ఎకరాల భూమిని జీవో ఎంస్ నెం.571, రెవెన్యూ (అసైన్డ్ .1) అనుసరించి మరియు బీఎస్వో 24 నిబంధనలను అనుసరించి మార్కెట్ ధర ఎకరానికి రూ.61,23,516 /- ల చెల్లింపుపై ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కు బదలాయించేందుకు చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

6.రెవిన్యూ శాఖ
-విజయనగరం, ఏ.ఎస్.ఆర్, కాకినాడ, ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పలనాడు, ఎన్.టి.ఆర్. జిల్లాల్లో తే.30.08.2024 దీకి తదుపరి వరద ముంపుకు గురైన ప్రాంతాల రైతులకు ఋణాలు రీ-షెడ్యూలు చేస్తూ రూ.50 వేల లోపు మంజూరు చేయబడిన ఋణాలపై ఇండియన్ స్టాంప్ చట్టం, 1899 సెక్షన్ 9(1)(a) ప్రకారం స్టాంప్ డ్యూటీ చెల్లింపు మరియు రిజిస్ట్రేషన్ చట్టం, 1908 లోని సెక్షన్ 78 కింద యూజర్ చార్జీల మినహాయించడానికి మరియు ఋణాల రీ-షెడ్యూలుకు మరియు కొత్త రుణాల మంజూరు ఇప్పటికే ప్రభుత్వంచే జారిచేయబడిన ఉత్తరువులు G.O.Ms.No.235, రెవెన్యూ (Regn.II) డిపార్ట్‌మెంట్, Dt: 22.10.2024 ని ర్యాటిఫై చేస్తూ మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఈ ఉత్తర్వులు తే.31-3-2025 దీ వరకు అమల్లో ఉండే విధంగా చేసిన ప్రతి పాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

7.అగ్రికల్చర్ & మార్కెటింగ్
-రాష్ట్రంలో 2024-25 ఏడాదిలో కొనసాగుతున్న వరి సేకరణ కార్యకలాపాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ స్టేట్ కో-ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ లిమిటెడ్ (ఏపీ మార్క్ ఫెడ్)కి రూ. 1000 కోట్ల అదనపు రుణాన్ని (ఇప్పటికే పొందబడిన రూ. 5000 వేల కోట్ల రుణానికి అదనంగా) జాతీయ సహకార అభివృద్ధి సంస్థ నుండి పొందేందుకుగాను ప్రభుత్వ హామీని పొడిగించడంతో పాటు నేషనల్ కోఆపరేటివ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎన్సీడీసీ) నుండి రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ లిమిటెడ్‌ (ఏపీఎస్సీఎస్సీఎల్) కు బదిలీ చేసేందుకు చేసిన ప్రతిపాదనలను మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-ధాన్యం కొనుగోలు చేసిన ఆరు, ఏడు గంటల్లోనే సొమ్ము చెల్లింపు చేయడం జరిగింది.
-ఇన్ స్టాంట్ పేమెంట్ చేసే అవకాశాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అదేశించడం జరిగింది.

8.అగ్రికల్చర్ & మార్కెటింగ్
-రాష్ట్ర విభజన చట్టం ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి బదలాయించబడిన ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మార్కెటింగ్ జి.వి. రమేశ్ కుమార్ ను తిరిగి ఏపీ రాష్ట్రంలో వారి రిటైర్మెంట్ తేదీ 30.06.2026 వరకు కొనసాగే విధంగా సూపర్ న్యూమరరీ పోస్టు క్రియేట్ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

9.జల వనరుల శాఖ
-ప్యాకేజీ నెం.3, ప్యాకేజీ నెం.5 & 5ఏ కింద పోలవరం నీటిపారుదల ప్రాజెక్ట్ ఎడమ ప్రధాన కాలువ యొక్క ప్యాకేజీ 6ఏ ఎసెన్షియల్ బ్యాలెన్స్ పనుల నిమిత్తం పిలిచిన టెండర్ల చర్యకు ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
-జ్యుడీషియల్ ప్రివ్యూ న్యాయమూర్తి పదవి ఖాళీగా ఉన్నందున ఎలాంటి ప్రివ్యూ లేకుండానే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

10.జల వనరులు
-హంద్రీనీవా సుజల స్రవంతి ఫేజ్ 2 కింద పుంగనూరు బ్రాంచ్ కెనాల్‌కు 75.075/74 కిలోమీటర్ల నుండి 189.800 కిలోమీటర్ల వరకు సీసీ లైనింగ్‌ పనులు చేపట్టడం వలన ఆ కెనాల్ సామర్థ్యం 145 క్యూసెక్కుల నుండి 282 క్యూసెక్కులకు ప్రవాహ సామర్థ్యం పెరగనుంది. ఈ కారణంగా అన్నమయ్య, చిత్తూరు జిల్లాలు లబ్ధి పొందనున్నాయి. ఈ సీసీ లైనింగ్ పనులకు ప్రతిపాదించిన 480.22 కోట్ల నిధుల వినియోగాన్ని అందుబాటులో ఉన్న రూ.1929 కోట్ల సేవింగ్స్ నిధుల నుండి ఖర్చు చేసేందుకు పరిపాలన ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-జూన్, జూలై కల్లా ఈ పనులను పూర్తి చేయడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది.

11.విద్యుత్ శాఖ
-క్లీన్ ఎనర్జీ ప్రాజెక్ట్‌ల అభివృద్ధి కోసం రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఎన్‌ఆర్ఈడీసీఏపీ) ద్వారా ఎన్టీపీసీతో జాయింట్ వెంచర్ ఏర్పాటుకు సంబంధించి తే.19.11.2024న రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్‌ల ఆమోదం కోసం చేసిన ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-రాష్ట్రంలో రూ.1.87 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు ఎన్టీపీసీ సిదమైంది..
-ఇంధన రంగంలో ఆంధ్రప్రదేశ్ ను అగ్రగామి చేసే క్రమంలో ఇదో కీలక అడుగు..
-ఈ మేరకు సీఎం చంద్రబాబు మంత్రులు లోకేశ్, గొట్టిపాటి సమక్షంలో ఒప్పందం కూడా జరిగింది.
-దీంతో రాష్ట్రానికి రూ.20,620 కోట్ల ఆదాయం రానుంది.
-1 లక్షా 6 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.
-సౌర, పవన, పంప్డ్ స్టోరేజీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా వంటి పునరుత్పాదక విద్యుత్ రంగ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది..
-ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా వచ్చే ఐదేళ్లలో 78.50 గిగావాట్ల సౌరశక్తి, 35 గిగావాట్ల పవన శక్తి, 22 గిగావాట్ల పంప్డ్ స్టోరేజీ, 1.50 ఎంఎంటీపీఏ గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుని ముందడుగులు వేస్తోంది.

12.పాఠశాల విద్య శాఖ
-2014-19 మద్య కాలంలో అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇంటర్మీడియట్ విద్యార్థులకు కూడా మద్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడం జరిగింది.
-అయితే గత ప్రభుత్వం ఈ పథకాన్ని రద్దు చేయడం జరిగింది.
-ఇంటర్మీడియట్ కాలేజీల్లో గత ప్రభుత్వం రద్దు చేసిన మధ్యాహ్న భోజన పథకాన్ని మళ్లీ ప్రారంభించాలని నిర్ణయించింది.
-2024-25 & 2025-26 ఆర్థిక సంవత్సరాలకు గాను మొదటి ఏడాది రూ.27.39 కోట్లు, రెండో ఏడాదికి రూ.85.84 కోట్ల బడ్జెట్ అంచనాలతో 2024 డిసెంబర్ నుండి 475 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజన కార్యక్రమం అమలు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-రాష్ట్రంలో 475 ప్రభుత్వ జూనియర్ కాలేజీలున్నాయి.
-వీటిలో 300 కాలేజీలు ఉన్నత పాఠశాలల ప్రాంగణాలతో కలిసి ఉన్నాయి.
-ఆ పాఠశాలల్లోని వంటచేసే వారి ద్వారానే విద్యార్థులకు భోజనం అందిస్తారు.
-మిగిలిన 175 కాలేజీలకు సమీపంలోని పాఠశాలల నుంచి పంపిస్తారు.
-ఈ పథకం పునరుద్ధరణతో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని 1.41 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది.
-ఈ పథకం పునరుద్ధరణ వలన విద్యార్థులకు బలవర్థక ఆహారం అందించడంతో పాటు కాలేజీల్లో విద్యార్థుల చేరిక మరియు హాజరు శాతం పెరుగుతాయని, అల్పాదాయ వర్గాలపైన ఆర్థిక భారం తగ్గుతుందనే సదుద్దేశంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

13.పాఠశాల విద్య శాఖ
-ప్రభుత్వ జూనియర్ కాలేజీల మొదటి, ద్వితీయ సంవత్సరం విద్యార్థులతో పాటు రాష్ట్రంలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు, ఏపీ మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ విద్యా సంస్థలు మరియు హై స్కూల్ ప్లస్ విద్యా సంస్థలకు రూ.32.45 కోట్ల అంచనా వ్యయంతో 2025-26 విద్యా సంవత్సరం నుండి “సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర” కింద పాఠ్య పుస్తకాలు, వృత్తిపరమైన పాఠ్య పుస్తకాలు, పోటీ పరీక్షల మెటీరియల్, రికార్డ్ బుక్స్, నోట్‌బుక్‌లు కొనుగోలు చేసి సరఫరా చేసే ప్రతిపాదనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.
-ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ప్రస్తుతం ఇంటర్ విద్యకే పరిమితం కాగా ప్రైవేటు జూనియర్ కాలేజీలు జేఈఈ, నీట్ అంటూ అదనపు కోచింగ్ ఇస్తున్నాయి.
-వాటిపై విద్యార్థులు, తల్లిదండ్రులు కూడా ఆసక్తిగా ఉన్నారు.
-దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఇకపై ప్రభుత్వ కాలేజీల్లోనూ అదే విధానం అమలు చేయాలని నిర్ణయించింది.
-ఈనేపథ్యంలో కార్పొరేట్ కాలేజీల సలహాలు తీసుకుని స్టడీ మెటీరియళ్లు తయారుచేసింది.
-వాటిని విద్యార్థులకు అందించే కిట్ తో పాటు వచ్చే ఏడాది నుంచి అందిస్తారు.
-గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టులున్న విద్యార్థులకు మెటీరియల్ ఇస్తారు.
-ప్రైవేటు కాలేజీల తరహాలో పోటీ పరీక్షలకు రోజూ తరగతులు నిర్వహించనున్నారు.
-రోజూ ఇంటర్ సబ్జెక్టులు బోధిస్తూనే అదనంగా జేఈఈ, నీట్ అంశాలను కూడా బోధిస్తారు.
-హోలిస్టిక్ విద్యా విదానాన్ని ప్రభుత్వం కళాశాలల్లో ప్రవేశ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చే ఏడాది నుంచి సవరించిన కరిక్యులమ్ అమల్లోకి వచ్చాక పోటీ పరీక్షల మెటీరియల్స్ బోధించేందుకు ప్రత్యేక సమయం కేటాయిస్తారు.
-ప్రభుత్వ సలహాదారులు శ్రీ చాగంటి కోటేశ్వర రావు చే మోరల్ ఎడ్యుకేషన్ పై ప్రవచనాలను విద్యార్థులకు ఇప్పించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది.

14.రెవిన్యూ శాఖ
-జీవో.ఎంఎస్.నెం.646, రెవెన్యూ (సర్వీసెస్.II) తేదీ:23.9.2022 ప్రకారం రెండేళ్ల పాటు సృష్టించబడిన 679 సూపర్ ‌న్యూమరీ డిప్యూటీ తహశీల్దార్ (రీ-సర్వే) పోస్టులను మరో రెండు సంవత్సరాల పాటు అనగా 23.09.2024 నుండి 22.09.2026 వరకు కొనసాగించేందుకు మరియు సదరు జీవోలో పేర్కొన్న షరతులతో, రీసర్వే పూర్తి చేయడంతో పాటు ఏపీ రీసర్వే ప్రాజెక్ట్ కింద మిగిలిన 10,128 గ్రామాల్లో రీసర్వే చేయాలని చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

15.రెవిన్యూ శాఖ
-ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ టీచింగ్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు కోసం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలో ఇప్పటికే నెలకొల్పబడిన ఎయిమ్స్ ఇనిస్టిట్యూట్ వాస్తవంగా 183.11 ఎకరాలకు బదులుగా 177.07 ఎకరాలు మాత్రమే అనుభవంలోకి వచ్చిట్లు సంబంధిత రెవెన్యూ అధికారులు గుర్తించారు.
-ఈనేపథ్యంలో ఎయిమ్స్ తరహా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కమ్ టీచింగ్ ఇనిస్టిట్యూషన్ ఏర్పాటు కోసం గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని సర్వే నెం.372 మరియు మంగళగిరి మండలం సర్వే నెం.232-5& 6, 403 లలో 183.11 ఎకరాల భూమిని జీవో. ఎంఎస్.నెం 429 రెవెన్యూ (Assn.IV) డిపార్టుమెంట్, తేదీ.12.11.2015 ద్వారా హెల్త్ మెడికల్ & ఫ్యామిలీ వెల్ఫేర్ కు కేటాయించబడిన ప్రభుత్వ భూమి విస్తీర్ణాన్ని సవరిస్తూ 183.11 ఎకరాల నుండి 177.07 ఎకరాలకు తగ్గిస్తూ మరియు సబ్ డివిజన్ నంబర్‌లను కూడా కలుపుకుని ఎరాటా జారీ చేసేందుకు చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.

LEAVE A RESPONSE