Suryaa.co.in

National

ధనిక రాష్ట్రాన్ని కాస్త దివాళా రాష్ట్రంగా మార్చేశాయి

– సంక్రాంతి తరువాత ఉద్యమాలను ఉధృతం చేస్తాం.
– కేంద్ర మంత్రి బండి సంజయ్

ఢిల్లీ: తెలంగాణ ప్రజలు నమ్మి అధికారం కట్టబెట్టిన పాపానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోయలేని అప్పుల భారాన్ని మోపాయి. బీఆర్ఎస్ గత పదేళ్ల పాలనలో రూ.6లక్షల 71వేల 756 కోట్ల అప్పు చేసినట్లు ప్రభుత్వమే ప్రకటించింది.

ఇక కాంగ్రెస్ ఏడాది పాలనలో రూ.1లక్షా 27వేల కోట్లకు పైగా అప్పులు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా వెల్లడైంది. మొత్తంగా తెలంగాణ ప్రజల మీద ఈ రెండు పార్టీలు రూ.8 లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపి, ధనిక రాష్ట్రాన్ని కాస్త దివాళా రాష్ట్రంగా మార్చేశాయి.

అప్పుల్లో కొట్టుమిట్టాడుతున్న తెలంగాణలో పన్నుల భారాన్ని మరింత పెరిగే అవకాశం ఉంది. పాత అప్పుల వడ్డీల కోసం ప్రభుత్వం కొత్త అప్పులు చేస్తోంది.

పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే మేధావులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యమకారులతో పాటు తెలంగాణ శ్రేయస్సును కోరుకునే ప్రతి ఒక్కరు కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలని బిజెపి పక్షాన కోరుతున్నాను.

ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం తేవడంతో పాటు రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఉండేందుకు, రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి 6 గ్యారంటీలను అమలు చేయించేందుకు తెలంగాణ అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆధ్వర్యంలో సంక్రాంతి తరువాత ఉద్యమాలను ఉధృతం చేస్తాం.

LEAVE A RESPONSE