– అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా?
– ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా? తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదు
– నువ్వు ఏమన్నా తీస్మార్ ఖాన్ అనుకుంటున్నావా?
– నువ్వు బాధితుడివా? ఏ రకంగా బాధితుడివి?
– ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టొచ్చా?
-ఇష్టం వచ్చినట్లు తిడితే రీల్స్ కట్ చేస్తాం
-మీరు ఉన్నదే.. లీజు జాగాలో
– సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ?
– అర్జున్ తీరుపై విరుచుకుడ్డ ఏసీపీ విష్ణుమూర్తి
– అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ సర్కార్
హైదరాబాద్: “ఓ సినిమా యాక్టర్ నిన్న ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ఘటన ఒక యాక్సిడెంట్ అని, అందుకు ఎవరూ కారకులు కారని చెప్పారు. ఆయనపై ఎవరికీ పగ లేదు. కానీ ఆయన చేసే పనులు రాజ్యాంగానికి, చట్టానికి లోబడి ఉన్నాయా, లేదా అనేది చూసుకోవాలి. ఆయనేమీ పాలుతాగే పిల్లవాడు కాదు. 40 ఏళ్లు పైబడిన వ్యక్తి. ఎంత జాగ్రత్తగా ప్రవర్తించాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి? ఏసీపీ సబ్బతి విష్ణుమూర్తి అని ప్రశ్నించారు.
అల్లు అర్జున్ బాధ్యత పౌరుడిగా ప్రవర్తించలేదని, సంధ్య థియేటర్ వద్ద అల్లు అర్జున్ బౌన్సర్ల తోపులాటతోనే మహిళ చనిపోయిందన్నారు. బౌన్సర్లతో దౌర్జన్యం కరెక్ట్ కాదని, పబ్లిక్ ప్లేసులలో సెలెబ్రెటీలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. పోలీసులు తమ విధులను సరిగానే వ్యవహరించారని, పోలీసులంటే కనీస గౌరవం లేకుండా మాట్లాడుతున్నారని, పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు.
అధికారులను ఇష్టం వచ్చినట్లు తిడితే రీల్స్ కట్ చేస్తామంటూ ఘాటుగా స్పందించారు. అల్లు అర్జున్ డబ్బు మదంతో పోలీసుల మీద అవాకులు చెవాకులు పేలుతున్నారని, విచారణను ప్రభావితం చేసే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.
అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. లేదంటే తోలు తీస్తామన్నారు. సినిమా వాళ్ల బట్టలు ఊడతీస్తామని, మీరు ఉన్నదే లీజు జాగాలో. జూబ్లీహిల్స్ ఏరియాలో మీకు అంత పెట్టి డబ్బులు ఎక్కడివని విష్ణుమూర్తి ప్రశ్నించారు.
అప్పట్లో ఉన్న రాజకీయ నాయకులు ఎవరో ఇండస్ట్రీ అభివృద్ధి కావాలని మీకు భూములు ఇచ్చారని, వాపు చూసి బలం అనుకోవదన్నారు. సినిమా వాళ్ల దాదాగిరి ఏంటీ? అని నిలదీశారు. ఇష్టమొచ్చినట్లు టికెట్ రేట్లు పెంచారని, ఇన్ని కోట్లు పెట్టి సినిమాలు తీయమని మేము బ్రతిమిలాడామా? అన్నారు. అసలు అల్లు అర్జున్ కి తెలంగాణలో ఆధార్ కార్డు ఉందా? అంటూ ప్రశ్నించారు.
పోలీస్ అధికారులు నాకు చెప్పలేదు అంటున్నావు. నీకు ఎందుకు చెప్పాలి. నువ్వు ఏమన్నా తీస్మార్ ఖాన్ అనుకుంటున్నావా? నువ్వు మామూలు పౌరుడివి. నీకు ఆధార్ కార్డు ఆంధ్రలో ఉందా? తెలంగాణలో ఎక్కడ ఉందో కూడా తెలియదన్నారు. అసెంబ్లీలో నీ వల్ల గంట సమయం పోయింది. నీ గురించి మేము ఎందుకు బాధపడాలన్నారు. తెలంగాణ సమాజం సౌమ్యులు కాబట్టి మీరు ఇంకా ఇక్కడ నాటకాలు చేస్తున్నారంటూ స్పందించారు.
మీడియాతో మాట్లాడిన విష్ణుమూర్తి ఇంకా ఏమన్నారంటే.. ఒక సెలెబ్రిటీగా ఉన్న వ్యక్తి చట్టాల గురించి, తన పరిధి గురించి తెలుసుకోవాలి? అసలు ముద్దాయిగా ఉన్న వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టొచ్చా? ఆ అధికారం ఉందా? ఆయన రిమాండ్ ఖైదీ. బెయిల్ పై బయట ఉన్నారు. ప్రెస్ మీట్ పెట్టే అధికారం ఆయనకు ఉందో లేదో నాకు తెలియదు. ఆయనకే తెలియాలి. తాను, దర్శకుడు సుకుమార్, మరొకరు కలిసి కొంత మొత్తం బాధిత కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నట్టు చెప్పారు. ఈ చర్య పరోక్షంగా బాధితులను ప్రలోభానికి గురిచేసినట్టే అవుతుంది.
నిన్న ఆయన కళ్లలో నాకు ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదు. ఈ పదిహేను రోజుల నుంచి సక్సెస్ మీట్ లు పెట్టుకోలేకపోతున్నాననే బాధే కనిపించింది తప్ప, ఆయనలో ఎలాంటి విచారం లేదు. ఆయన తన ఇంటిని ఒక ఫంక్షన్ హాల్ లాగా మార్చేసి వచ్చేవాళ్లు, పోయేవాళ్లతో ఆయన చాలా హ్యాపీగా గడిపేస్తున్నాడు.
చట్టం ఎప్పుడూ బాధితుల పక్షానే ఉంటుంది. మరి నువ్వు బాధితుడివా? ఏ రకంగా బాధితుడివి? బాగా పైసలు సంపాదించుకుని, లెక్కలు చూసుకుంటున్నావు. నీపై ఎవరైనా వ్యాఖ్యలు చేసినప్పుడు ప్రెస్ మీట్లు పెడుతున్నావు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పరిస్థితి చూస్తే అల్లు అర్జున్ వర్సెస్ తెలంగాణ సర్కార్ అన్నట్టుగా తయారైంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట వ్యవహారం పై అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేయగా, అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టి బదులిచ్చారు.
Maanchi point pattadu . pic.twitter.com/TNhZaAA6zo
— 𝘿 (@Pokiri2497) December 22, 2024