– క్రిస్మస్ వేడుకలకు ముఖ్యఅతిథిగా మంత్రి హాజరై మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి కేక్ కట్ చేసి, పాస్టర్లకు దుస్తులు పంపిణీ చేసిన మంత్రి కొండా సురేఖ
వరంగల్: ఏసుక్రీస్తు బోధనలు సర్వమానవాళికి మార్గదర్శకమని రాష్ట్ర అటవీ పర్యావరణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సోమవారం జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వరంగల్ సిటీలోని మంత్రి క్యాంప్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకలకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరై నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా,పాస్టర్లలతో కలిసి క్రిస్మస్ వేడుకల కేక్ కట్ చేసి, నియోజకవర్గంలోని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని పాస్టర్ లందరికీ మంత్రి తన సొంత ఖర్చుతో దుస్తులను పంపిణీ చేసి అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఏసు బోధనలు ఒక మతానికి సంబంధించినవి కావని యావత్తు మానవాళికి మార్గదర్శకత్వం చేసేవి అని తెలిపారు.