* బాల కార్మిక వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలి
* ఈఎస్ఐ హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలి
* ప్రస్తుతం ఇన్సూరెన్స్ పర్సన్స్ 14 లక్షలు నుండి 25లక్షలు వరకు పెంచే విధంగా కృషి చేయాలి
అమరావతి: సచివాలయంలో ఈరోజు లేబర్ డిపార్ట్మెంట్ మరియు ఐ.ఎం.ఎస్ డిపార్ట్మెంట్ వారితో రివ్యూ మీటింగ్ ను ఆంధ్రప్రదేశ్ కార్మిక, ఫ్యాక్టరీల, బాయిలర్లు బీమా వైద్యశాఖ శాఖ మంత్రి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న నాలుగు ఈ.ఎస్.ఐ హాస్పిటల్స్ ను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
అలాగే ఇన్సూరెన్స్ పర్సన్స్ (IP) లను ప్రస్తుతం14.5 లక్షలు ఉన్న ఇన్సూరెన్స్ పర్సన్స్ ను 25 లక్షలు పెరిగే విధంగా కార్మిక శాఖతో సమన్వయం చేసుకొని వారి సంఖ్య పెరిగే విధంగా చూడాలన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి ఈఎస్ఐ హాస్పిటల్స్ లను సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గా అభివృద్ధి చేయాలి. ప్రస్తుతం ఉన్న హాస్పిటల్స్ డిస్పెన్సరీలు డయాగ్నోస్టిక్ సెంటర్ లను పూర్తిస్థాయిలో పనిచేయుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలి.
ముఖ్యంగా అవసరమైన సిబ్బందిని, పరికరాలు సమకూర్చటంలో తగు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపాలి. ఈ.ఎస్.ఐ.సి అందించే పనులు పూర్తిస్థాయిలో వినియోగించుకొని ఎక్కువ ప్రయోజనం పొందుటకు అవసరమైన ప్రతిపాదనలు రెడీ చేయాలి అని సూచించారు. తనిఖీ అధికారులు లేకపోవడం వల్ల ఫ్యాక్టరీలలో, షాపుల్లో పనిచేయు కార్మికులకు ఈఎస్ఐ కార్డ్స్ నమోదు చేయలేకపోతున్నారు. దీనిపై ప్రత్యేక దృష్టి సారించి అవసరమైతే స్పెషల్ డ్రైవ్ ను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
ఇటీవల నాకు తణుకు ఎమ్మెల్యే తణుకులో, అలాగే మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులో హాస్పిటల్స్ ఏర్పాటు చేయమని కోరారు. దానికి అవసరమైన ప్రతిపాదనలు పరిశీలించి నాకు అందజేయాలని తెలిపారు. స్పెషల్ గ్రేడ్ సివిల్ సర్జన్ నుండి క్రింది స్థాయి డాక్టర్ల వరకు మరియు ఇతర ఉద్యోగులకు ప్రమోషన్స్ త్వరగా ఇచ్చేందుకు ప్రతిపాదనలు రెడీ చేయాలన్నారు.
కార్మిక శాఖ విషయానికి వస్తే బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనలో కార్మిక శాఖ పాత్ర చాలా ముఖ్యమైనది. ఇందులో మన అధికారులు చేపట్టిన కార్యక్రమాలు ఏమిటి, వాటి ఫలితాలు ఎలా ఉన్నాయని, ఈ ప్రయోజనాలను ప్రజల్లోకిఎలాతీసుకువెళ్తున్నారుని అధికారులను ప్రశ్నించారు. అలాగే ఏపీ లేబర్ వెల్ఫేర్ బోర్డ్ లో ఎలాంటి పథకాల అమలులో ఉన్నాయి. గత ప్రభుత్వం నిలుపుదల చేసిన పథకాల విషయంలో, మనం ఎలాంటి చర్యలు తీసుకోవచ్చునని వాటి ప్రతిపాదన కూడా సిద్ధం చేయాలని కోరారు. చంద్రన్న బీమా మీద విధి విధానాలు త్వరత్వర ఖరారు చేయాలి.
అలాగే మార్చి నెల నుండి పెండింగ్ క్లెయిమ్స్ ని కూడా త్వరగా పరిష్కరించడానికి తగు చర్యలు తీసుకోవాలి. ఏ.ఎల్.ఓ.ఏ.సీ.ఎల్. డీ.సీ.ఎల్ మరియు ఇతర ఉద్యోగుల ప్రమోషన్లలో డిపిసీ లు త్వరగా జరిపి పూర్తిచేయాలని కంపాశనేట్ అపాయింట్మెంట్స్ ఏమైన ఇవ్వాల్సి ఉంటే వారికి న్యాయం జరిగే విధంగా సత్వర చర్యలు తీసుకోవాలి. ఈరివ్యూ మీటింగ్ లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాణి ప్రసాదు గారు, అడిషనల్ సెక్రటరీ గంధం చంద్రుడు గారు, ఐ ఎం ఎస్ డైరెక్టర్ ఐ ఆర్ టి ఎస్ ఆంజనేయులు, లేబర్ జాయింట్ కమిషనర్ లు, డిప్యూటీ కమిషనర్లు పాల్గొన్నారు.