– చేనేత వస్త్రాలు ధరించి చేనేతను కష్టాల నుండి విముక్తి చేద్దాం
– ఆప్కో షోరూమ్ ను పరిశీలించిన మంత్రి సవిత
కర్నూలు : నగరంలో ఆప్కో షోరూమ్ ను కర్నూల్ ఎంపీ నాగరాజు గారితో కలసి తనిఖీ చేసిన రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖామాత్యులు శ్రీమతి ఎస్.సవిత గారు. షో రూమ్ లోని అన్ని వస్త్రాలను పరిశీలించారు. ఏ యే వస్త్రాలు అందుబాటులో ఉన్నాయని అక్కడి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అమ్మకాలు రోజూ ఏ మేర జరుగుతున్నాయని ఆరా తీశారు. ఏ వ్యాపారిని కైనా కస్టమర్లే దేవుళ్లని, వాళ్లతో హుందాగా వ్యవహరించాలని అక్కడి సిబ్బందికి మంత్రి సవిత దిశా నిర్దేశం చేశారు.
సంక్రాంతి పండుగకు ప్రతి ఒక్కరు చేనేత వస్త్రాలు ధరించాలని మంత్రి సవిత తెలిపారు..చేనేత వస్త్రాలు ధరించి చేనేతను కష్టాల నుండి విముక్తి చేద్దాంమని ఎంపీ నాగరాజు తెలియచేశారు .ఈ సందర్భంగా షో రూమ్ లో చేనేత వస్త్రాలును కొన్న ఎంపీ నాగరాజు .ఈ కార్యక్రమంలో అధికారులు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు…