తెలంగాణలో త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలకు పోటీచేసే అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది. రెండు ఉపాధ్యాయ, ఒక పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం ప్రకటించారు.
నల్గొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి పులి సరోత్తం రెడ్డి, కరీంనగర్-నిజామాబాద్- ఆదిలాబాద్-మెదక్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానానికి మల్కా కొమరయ్య (ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ) కరీంనగర్- నిజామాబాద్-ఆదిలాబాద్-మెదక్ పట్టభద్ర అభ్యర్థిగా సి.అంజిరెడ్డిని ప్రకటించారు.