Suryaa.co.in

Andhra Pradesh

నిరుద్యోగులకు ఉపాధి కల్పన కూటమి ప్రభుత్వ ధ్యేయం

– వైసీపీ పాలనలో విద్యా రంగానికి గడ్డుకాలం.
– ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తులను గెలిపిద్దాం.
– ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతల సమావేశంలో గన్ని కృష్ణ, వాసంశెట్టి సత్యం పిలుపు

రామచంద్రపురం: నిరుద్యోగులకు ఉపాధి కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని, గత వైసిపి పాలనలో విద్యారంగం గడ్డు పరిస్థితిని ఎదుర్కొందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్నికల పరిశీలకులు గన్ని కృష్ణ, కూటమి పార్టీ సీనియర్ నాయకులు, మంత్రి సుభాష్ తండ్రి వాసంశెట్టి సత్యంలు విమర్శించారు.

రామచంద్రపురం లోని మోడరన్ విద్యాసంస్థల ప్రాంగణంలో జరిగిన ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించాలని కోరుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ప్రైవేట్ విద్యాసంస్థల అధినేతలతో జరిగిన సమావేశంలో ఇరువురు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. తొలుత గన్ని కృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్తు అంతా కూటమి పాలనలో సువర్ణమయం కానుందని, స్వర్ణాంధ్ర 2047 లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారన్నారు.

LEAVE A RESPONSE