న్యూఢిల్లీ: కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ అనుబంధ సంస్థ డిఏఎస్ భారత ప్రభుత్వం అఖిల భారత బోర్డు సభ్యులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లా భీమవరానికి చెందిన గరికిముక్కు సుబ్బయ్య నియమితులయ్యారు. గురువారం న్యూఢిల్లీలో జరిగిన డిఏఎస్ జనరల్ బాడి సమావేశంలో ఆయనకు బోర్డు సభ్యులుగా చైర్మన్ కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ మంత్రి డా వీరేంద్ర కుమార్ నియామక పత్రం అందజేశారు.