Suryaa.co.in

Telangana

మోడీకి ధీటైన లీడర్ ఈ దేశంలోనే లేడు

– 30ఏళ్ల వరకు బీజేపీ ని దింపే నాయకుడే లేదు
– అక్కడా.., ఇక్కడా బీజేపీ సర్కార్ ఉంటేనే అభివృద్ధి
– తెలంగాణ లో కాషాయ జెండా ఎగరేద్దాం
– ముసాపేట లో పార్టీ కార్యకర్తలకు ఎంపీ. డికె అరుణ దిశా నిర్దేశం
– దేవరకద్ర నియోజకవర్గం మూసాపేటలో బీజేపీ ముఖ్య నాయకుల సమావేశం
– పాల్గొన్న జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, పార్లమెంట్ కన్వీనర్ డోకూరి పవన్, కంటెస్టెడ్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి, పార్టీ ముఖ్య నాయకులు
– ఎంపీ. డికె అరుణ సమక్షంలో బీజేపీ లో చేరిన మాజీ సర్పంచ్ బీఆర్‌ఎస్ సీనియర్ లీడర్ భాస్కర్ చంద్ర 100 మంది ఆయన అనుచరులు

దేవరకద్ర: మోదీకి పోటీ ఎవరు? వచ్చే 30ఏళ్ల వరకు బీజేపీ ని దింపే నాయకుడే లేదు. ప్రతిపక్షాల్లో మోడీకి ధీటైన లీడర్ ఈ దేశంలోనే లేడు.తెలంగాణలో బీజేపీ అధికారంలో రావడమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలి. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్ మోసం చేసిందని మరోసారి బీఆర్‌ఎస్ కు ఓటేస్తే మోస పోతారు. అక్కడా.., ఇక్కడా బీజేపీ సర్కార్ ఉంటేనే అభివృద్ధి. ప్రజల్లోకి ఆ విషయాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలదే.

రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మనకోసం, మన పిల్లల భవిష్యత్ కోసం బీజేపీని గెలిపించుకోవాలి. పేద ప్రజల అభివృద్ధి కోరుకునే వ్యక్తి మన ప్రధాని మోడీ. అందుకే మూడో సారి మోడీని ప్రధానిగా దేశ ప్రజల గెలిపించారు. తెలంగాణ బీజేపీకి ఇంత ఆదరణ వచ్చిందంటే ఆది ప్రధాని మోదీ వల్లే.

నమ్మి ఓట్లేస్తే కాంగ్రెస్ ప్రజలను మోసం చేసింది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. pm అవాస్ యోజన కింద కేంద్రం నిధులు ఇస్తే ఇదిరమ్మ ఇళ్ల పేరు పెడతారా? ఆ ఇళ్లకు ఇస్తున్న రూ.5 లక్షలలో 75% కేంద్రానివే. అబద్దాల మీద కాదు ప్రజల విశ్వాసం గెలవాలని మా ప్రధాని మోదీ చెప్పారు. డబు ల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి సాధ్యం అని ఎన్నికల్లో మేము చెప్తే నమ్మలేదు. కానీ కాంగ్రెస్ మాటలు నమ్మి ఇవాళ మోసపోయారు.

బీజేపీని గెలిపిస్తేనే తెలంగాణ అభివృద్ధి సాధ్యం.మా పాలన రోల్ మోడల్ అంటూ మహారాష్ట్ర ఢిల్లీకి వెళ్లి గప్పాలు కొట్టినా ప్రజలు నమ్మలేదు. అందుకే మహారాష్ట్ర లో, ఢిల్లీలో కాంగ్రెస్ కు ప్రజలు గుండు సున్నా ఇచ్చారు. కాంగ్రెస్ కు ఓట్లు సీట్లు కావాలి, ప్రజల అవసరాలు, అభివృద్ధి తో పని లేదు. అందుకే ఎన్నికలు వచ్చినప్పుడల్లా కాంగ్రెస్ కొత్త డ్రామాలు ఆడుతుంది. గతంలో మతాల మధ్య గొడవలు పెట్టారు., ఇప్పుడు కులగణన అంటూ కాంగ్రెస్ కులాల మధ్య చిచ్చు పెడుతోంది .

LEAVE A RESPONSE