Suryaa.co.in

Telangana

రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ ఖాన్

– రాహుల్ గాంధీ ఇల్లీగల్ గా కన్వర్టెడ్ గాంధీ
– చాలామంది రెడ్డి కులస్తులు.. రెడ్డి గాండ్ల అని పేరు పెట్టుకుని బీసీ సర్టిఫికెట్లు పొందుతున్నరు
– దీనికి సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి
– మోదీ కులం గాండ్ల
– బీసీ రిజర్వేషన్లు అమలైనప్పుడు గాండ్ల కులం బీసీ జాబితాలోనే ఉంది
రేవంత్ పుణ్యమా అంటూ తెలంగాణ రాజకీయాల్లో సబ్జెక్ట్ కంటే సొల్లు రాజకీయాలు
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్

హైదరాబాద్:నరేంద్ర మోదీ ఒక విశ్వగురువుగా, యుగపురుషుడుగా ఉన్నారు. అలాంటి వ్యక్తిని విమర్శించడం తగదు. మోతీలాల్ ఓరా పూర్వీకులు ముస్లింలు. వారు హిందూ మతాన్ని స్వీకరించారు. ఇందిరా గాంధీ గారి భర్త అసలు పేరు ఫిరోజ్ ఖాన్. ఆయన పిల్లలు రాజీవ్ గాంధీ. రాజీవ్ గాంధీ తన పేరును రాజీవ్ ఖాన్ అని పెట్టుకోవాలి. రాహుల్ గాంధీ అసలు పేరు రాహుల్ ఖాన్, కానీ గాంధీ అనే పేరు ఉపయోగిస్తున్నారు. నెహ్రూ కుటుంబానికి, రాహుల్ గాంధీ కి… గాంధీ అనే పేరు ఎలా వచ్చింది..?

రాహుల్ గాంధీ ఇల్లీగల్ గా కన్వర్టెడ్ గాంధీ. రామాయణంలో మారీచుడు అనే రాక్షసుడు రూపాలు మార్చి మారలేని రూపంలోకి మారాడు. ఈరోజు సోనియా, రాహుల్ గాంధీ కుటుంబం కులాలు, మతాలు, పేర్లు మార్చుకుంటూ వస్తున్నారు. రానురాను భారతదేశాన్ని హిందూ మైనారిటీ రాష్ట్రంగా మార్చడానికి కంకణం కట్టుకున్నారు. సోనియా గాంధీ కుటుంబం మతాలు, కులాలు, పేర్లు మారుస్తూ వస్తోంది. వారి అసలు లక్ష్యం భారత్‌ను హిందూ మైనారిటీ దేశంగా మార్చడం.సోనియా, రాహుల్ గాంధీ కుటుంబానికి తగిన బుద్ధి చెప్పాలి.

తెలంగాణలో గాండ్ల కులం బీసీ జాబితాలో ఉంది. ఇది మోదీ రాజకీయాల్లోకి రాకముందే ఉన్న విషయం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అవాస్తవాలు పలకడం మానుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలోని కరీంగనర్, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ చాలామంది రెడ్డి కులస్తులు.. రెడ్డి గాండ్ల అని పేరు పెట్టుకుని బీసీ సర్టిఫికెట్లు పొందుతున్నరు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి జవాబు చెప్పాలి.

సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అంటూ తెలంగాణ రాజకీయాల్లో సబ్జెక్ట్ కంటే సొల్లు రాజకీయాలు ఎక్కువయ్యాయి. మేనిఫెస్టో హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారు. హైడ్రా, హెచ్ఎండీఏ, ట్రిపుల్ ఆర్, కుల గణన, రాజకీయ గణన వంటి అంశాలతో ప్రజలను మభ్యపెడుతున్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ గారిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. కుల అహంకారంతో రేవంత్ రెడ్డి, మోదీ కన్వర్టెడ్ బీసీ అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు. ఇది తీవ్రంగా ఖండించదగిన విషయం. మోదీకి రేవంత్ రెడ్డి అడ్డొచ్చినా, రేవంత్ రెడ్డికి మోదీ అడ్డొచ్చినా, నష్టపోయేది రేవంత్ రెడ్డియే. సీఎం హోదాలో ఉన్న వ్యక్తి హుందాగా, బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.

మోదీ ఎప్పుడూ తాను బీసీ అని చెప్పలేదు. ఆయన “మోదీ కా పరివార్” అని, దేశమంతా తన కుటుంబమేనని చెబుతారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒక వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసిన ఘనత బీజేపీదే. ప్రధాని మోదీ కులాన్ని ప్రస్తావిస్తూ రేవంత్ రెడ్డి చులకనగా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కాంగ్రెస్ నాయకుల తీరుతో భవిష్యత్తులో మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ కులాలను ప్రస్తావించే దుర్భాగ్యమైన పరిస్థితి భారతదేశానికి రాకూడదు.

రాజకీయ విమర్శలు వేరు, వ్యక్తిగతంగా అవహేళన చేయడం వేరు. మోదీగురించి అవహేళనగా మాట్లాడిన వారు చివరకు ఏమయ్యారో తెలుసుకోవాలి. ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ మోదీ గారి చదువు, డిగ్రీ గురించి అవహేళనగా మాట్లాడారు. చివరికి తీహార్ జైలుకు వెళ్లారు. ఢిల్లీ ప్రజలు, ఓటర్లు కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవిని ఊడ్చేశారు. ఈ విషయం రేవంత్ రెడ్డి గుర్తుంచుకోవాలి.

కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ కూడా మోదీ గురించి, పేదరికం గురించి అవహేళన చేశారు. ఇప్పుడు ఆయన అరణ్యమాణ్యాలు తిరుగుతున్నారు. మోదీ కులం “తెలి”. తెలంగాణలో గాండ్ల కులంగా పేర్కొంటారు. బీసీ రిజర్వేషన్లు అమలైనప్పుడు గాండ్ల కులం బీసీ జాబితాలోనే ఉంది. అది మోదీ రాజకీయాల్లోకి రాకముందు నుంచే ఉంది. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యాక .. మోదీజీ బీసీ కులంగా కన్వర్ట్ అయ్యారంటూ విమర్శలు చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం.

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో కుల గణన పేరిట రాజకీయ గణన చేస్తోంది. 1931లో బ్రిటీష్ హయాంలో బీసీల సంఖ్య 52% గా ఉండేది. ఇప్పుడు బీహార్ కుల గణనలో 63%గా ఉంది. మండల్ కమిషన్ ద్వారా దేశం మొత్తంలో శాంపిల్ సర్వే చేసినప్పుడు బీసీల సంఖ్య 53 శాతంగా ఉంది. మొన్న బీహార్ రాష్ట్రంలో కులగణన చేసినప్పుడు అందులో బీసీల సంఖ్య 63 శాతంగా ఉంది. తెలంగాణలో బీసీల సంఖ్య తగ్గించి, వారిని రాజకీయంగా దెబ్బ కొట్టే కుట్ర జరుగుతోంది.

మున్నూరు కాపులు 12 లక్షల మంది మాత్రమే ఉన్నారా? గౌడ్ సామాజిక వర్గం సంఖ్య 23 లక్షల నుంచి 16 లక్షలకు తగ్గిందా? గొల్లకురుమల సంఖ్యను 18 లక్షలకు కుదించారు. రజకులు, వడ్డెర కులస్తుల సంఖ్యను తక్కువగా చూపించి, బీసీల సంఖ్యను తగ్గించడానికి కుట్ర చేస్తున్నారు. ముస్లింలను కొత్తగా బీసీలుగా ప్రకటించి, బీసీలకు రావాల్సిన హక్కులను, రిజర్వేషన్లను హరిస్తున్నారు.

స్వాతంత్రం వచ్చిన తర్వాత బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని బాబా సాహెబ్ అంబేద్కర్ చేసిన ప్రతిపాదనను నెహ్రూ గారు తిరస్కరించారు. ఇందిరా గాంధీ హయాంలో బీసీ కమిషన్ ఏర్పాటుపై ప్రతిపక్షాలు ఎన్నిసార్లు డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. రాజీవ్ గాంధీ మండల్ కమిషన్ అమలును వ్యతిరేకించారు. యూపీఏ హయాంలో సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ తీసుకురాలేదు.

కాంగ్రెస్ బీసీలను ఎప్పుడూ పట్టించుకోలేదు. బీసీ ముఖ్యమంత్రిని చేయలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వంలో 61% మంది కేంద్ర మంత్రులు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చెందినవారు. తెలంగాణలో ముస్లింలు ఇప్పటికే 24% రిజర్వేషన్లు పొందుతున్నారు. బీసీ-ఈ కింద 4%, బీసీ-బీ కింద విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు అనేకసార్లు స్పష్టం చేసింది. మోదీ ప్రభుత్వం 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చింది. అందులో ముస్లింలు కూడా ఉన్నారు.

రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీ పై చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి. బీసీలను చులకన చేసి మాట్లాడడం ఆపాలి. మోదీ పై వ్యక్తిగత విమర్శలు చేయడం బీజేపీ సహించదు. తెలంగాణ ప్రజలు ఈ తప్పుడు రాజకీయాలను మన్నించరు.

LEAVE A RESPONSE