– ఫరీదాబాద్‌లో టెర్రరిస్ట్ అరెస్ట్
అయోధ్య రామమందిరం దాడికి ఉగ్రవాదులు స్కెచ్ గీశారు . రామమందిరంపై దాడికి పాకిస్తాన్ ఐఎస్‌ఐ పన్నిన కుట్రను గుజరాత్ ఏటీఎస్,హర్యానా ఏటీఎస్ భగ్నం చేశాయి. ఢిల్లీ శివార్ల లోని ఫరీదాబాద్‌లో ఐఎస్‌ఐ ఉగ్రవాది అబ్దుల్ రెహ్మాన్‌ను అరెస్ట్ చేశారు. రెండు గ్రెనేడ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.