మీడియా పాయింట్ లో ఎమ్మెల్యేలు సబితా రెడ్డి, కోవా లక్ష్మీ
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో ప్రశ్నించడమే రాజద్రోహం గా నడుస్తోంది. జర్నలిస్టుల పై అక్రమ అరెస్టు చేస్తున్నారు. రేవతి, తన్వీ యాదవ్ ని అరెస్ట్ చేయడం బాధాకరం. జర్నలిస్టుల అరెస్ట్ చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నా. గతంలో రేవంత్ సొంత గ్రామం కొండారెడ్డి పల్లి లో మహిళ జర్నలిస్ట్ విజయరెడ్డి, సరితా పై దాడి చేస్తున్నారు. రేవంత్ రెడ్డి వద్దే హోమ్ శాఖ ఉంది. ఆయన కనుసైగల్లో జర్నలిస్టుల పై దాడి జరుగుతోంది. కానీ ముఖ్యమంత్రి ఇంకా స్పందించడం లేదు. కేసీఆర్ పై రేవంత్ రెడ్డి ఇంకిత జ్ఞానం లేకుండా మాట్లాడారు. మహిళ జర్నలిస్ట్ అరెస్టు ను బీఆర్ ఎస్ తరపున ఖండిస్తున్నాం.
మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం: కోవా లక్ష్మీ
స్పీకర్ పై జగదీష్ రెడ్డి ఏం మాట్లాడారో కాంగ్రెస్ నాయకులు మరోసారి చూడండి. సభలో కాంగ్రెస్ నాయకుల తీరు సరిగ్గా లేదు. ఆరు గ్యారెంటీ లను తప్పించడానికి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడటం లేదు. మహిళా జర్నలిస్టుల అరెస్ట్ అక్రమం.
ఈ ప్రభుత్వం లో పత్రికా స్వేచ్ఛ లేకుండాపోయింది. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా? జగదీశ్ రెడ్డి పై కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నాం.