FILE - NASA astronauts Suni Williams, left, and Butch Wilmore stand together for a photo enroute to the launch pad at Space Launch Complex 41 Wednesday, June 5, 2024, in Cape Canaveral, Fla., for their liftoff on a Boeing Starliner capsule to the International Space Station. (AP Photo/Chris O'Meara, File)
స్త్రీ- జాతి ఆణిముత్యం
రోదసీలో ధీర వనిత
అంతర్జాతీయ వ్యోమగామి
విలియమ్స్ సునీత గారు
అవనీ తలానికి నేడు రాక
జగదేక ప్రజలు ఆమెకి
పలుకుతున్నారు..సాదర స్వాగతం.
చుక్కల తోటలో చక్కగా తిరిగి
చందమామలోని చిదంబర రహస్యాలు చేజిక్కించుకొని ధరణికి ఆగమనం…
తొమ్మిది నెలల క్రితం సునీత
నాసా కేంద్రం నుంచి ఆకాశంలోకి
పక్షి ఎగిరేను పరిశోధనల కోసం…
నవ నెలలు పాటు…నింగిలో
అల్పాహారాలే..ఆమెకి ఆహారాలు
శూన్యాకాశంలో డేగ కళ్లతో సంచరించి చంద్రమండలం నుంచి భూమండలానికి రాక.
పరదేశంలో మనం పది రోజులు ఉంటే.. మాతృదేశం మీద మమకారం పుడుతుంది.
వేనవేల మైళ్ల దూరంలో ఉన్న రోదసిలోకి వెళ్లి తొమ్మిది మాసాలు మీరు ఉన్నారంటే…ఔరా…మీ ఓర్పుకి, నేర్పు కి జోహార్లు.
మీరు…చాలా గొప్పవారు.
గగనం కన్న విశాలత్వం ఉన్నవారు.
నీలాకాశంలోని… మీ సాహస కృత్యానికి ఏడు వందల కోట్ల మంది ప్రజలు తమ శిరసులు వంచుతూ మీకు సాదర స్వాగతం పలుకుతున్నారు.
– వాసు