Suryaa.co.in

Editorial

సింహం నవ్వింది!

( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుకు నవ్వడం తెలియదన్నది ఆయనను దగ్గరగా చూసిన వారికి తెలిసిన నిజం.ఎప్పుడూ గంభరంగా కనిపించే సీఎం చంద్రబాబునాయుడును ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమం విభిన్నంగా ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో ఆయన ఎమ్మెల్యేల స్కిట్లు చూసి పగలబడి నవ్వారు. బాబు ఇన్నేళ్లలో చూసిన సీనియర్లు, సహచరులు సైతం బాబు నవ్వును చూసి ఆశ్చర్యపోయారు. చీఫ్ విప్ ఆంజనేయులు, ఎమ్మెల్యే ఈశ్వర్ స్కిట్లు చంద్రబాబును కడుపుబ్బ నవ్వించాయి. ఆ స్కిట్లు చూస్తున్నంత సేపూ ఆయన న వ్వు ఆపుకోలేకపోయారు. ప్రధానంగా అర్థరాత్రి వేళ కార్యకర్తలు ఎమ్మెల్యేలకు ఫోన్ చేసి ఇబ్బందిపెట్టే స్కిట్‌లో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు జీవించారు. దానిని చూసిన బాబు జీవీ నటనకు ఫిదా అయ్యారు. వారిద్దరి నటనను బాబు అభినందించారు. ఇక దుర్యోధనుడి పాత్రలో జీవించిన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నటన, హావభావాలు తనను ఎన్టీఆర్‌ను గుర్తు చేశాయని బాబు అభినందించారు. ఎప్పుడూ సీరియస్‌గా ఉండే చంద్రబాబు ఇంతగా నవ్వడాన్ని తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యానించారు. అటు ఆర్ధికమంత్రి కేశవ్ కూడా.. నలభై ఏళ్ల తన అనుభవంలో చంద్రబాబు నవ్విన సందర్భం లేదని, అలాంటిది ఆయనను నవ్వించిన ఘనత తమ ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలేనన్నారు.

LEAVE A RESPONSE