తాడేపల్లి: నెల్లూరులో వైసీపీ అధినేత జగన్ పర్యటించనున్నారు. వైసీపీ నేత నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన నెల్లూరుకు రానున్నట్టు తెలుస్తోంది. ప్రసన్న ఇంటిపై ఇటీవల దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో ప్రసన్నను కలిసి ధైర్యం చెప్పేందుకు జగన్ వస్తారని.. ఇందుకు జగన్ కూడా ఓకే చెప్పినట్టు తెలిసింది. అదేవిధంగా కాకాణి గోవర్ధన్ రెడ్డిని కూడా నెల్లూరు జైల్లో కలుస్తారని చెబుతున్నారు. అయితే, జగన్ పర్యటనపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.