నేను ప్రతి రోజు వ్యాయామం లో భాగంగా ఒకే సారి 10 అంతస్తులు (250 మెట్లు) ఎక్కుతాను మళ్ళీ దిగుతాను (250 మెట్లు). దీనివల్ల ఏమైనా సమస్య వస్తుందా?
మెట్లు ఎక్కడం వలన మోకాళ్ళలో గుజ్జు అదరిపోతందనే అపోహ నిరాధారం. వాస్తవానికి, మెట్లు ఎక్కడం వల్ల మోకాళ్ళ కండరాలు బలపడతాయి, ఎముకలు బలంగా ఉంటాయి మరియు మొత్తం శరీర ఆరోగ్యం మెరుగుపడుతుంది.
ప్రయోజనాలు….
🔹 మెట్లు ఎక్కడం మంచి కార్డియో వ్యాయామం
🔹 కాళ్ళ కండరాలను బలోపేతం చేస్తుంది.
🔹 సమతుల్యతను మెరుగుపరుస్తుంది.
🔹 కీళ్ళ కదలికలను పెంచుతుంది.
సమస్యలు….
🔸 అతిగా చేస్తే మోకాళ్ళపై ఒత్తిడి పెరుగుతుంది.
🔸 సరైన పద్ధతి పాటించకపోతే గాయాలు సంభవించవచ్చు.
▫️🍳▫️ మెట్లు ఎక్కడం వల్ల సమస్యలు వచ్చు సందర్భాలు…
▫️ మోకాళ్ళలో ఇప్పటికే ఉన్న సమస్యలు… ఆర్థరైటిస్, మోకాళ్ళ గాయాలు వంటి సమస్యలు ఉన్నవారు మెట్లు ఎక్కడం సరయినది కాదు.
▫️ అధిక బరువు…. అధిక బరువు ఉన్నవారు మోకాళ్ళపై అధిక ఒత్తిడి తెస్తారు. కాబట్టి వారు మెట్లు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
▫️ తప్పుడు పద్ధతి…. మెట్లు ఎక్కేటప్పుడు తప్పుడు పద్ధతిని ఉపయోగించడం వల్ల కూడా మోకాళ్ళకు గాయాలు అయ్యే ప్రమాదం ఉంది.
సలహాలు….
– మెల్లగా ప్రారంభించి, క్రమంగా పెంచుకోండి.
– సరైన పద్ధతిని పాటించండి నేరుగా నిలబడి, పాదాలను పూర్తిగా మెట్టుపై ఉంచండి).
– మంచి షూలు ధరించండి.
– శరీరానికి విశ్రాంతి ఇవ్వండి, ప్రతిరోజూ చేయకండి.
– నొప్పి లేదా అసౌకర్యం అనిపిస్తే తగ్గించండి లేదా ఆపండి.
సరిగ్గా చేస్తే, మెట్లు ఎక్కడం వల్ల మోకాళ్ళలోని గుజ్జు అరిగిపోదు. మెట్లు ఎక్కడం మంచి కార్డియో వస్కులర్ వ్యాయామం. కండరాలు, కీళ్లు దృడంగా తయారవుతాయి.
చురక… 10 అంతస్థులకు 200 లోపే Steps ఉంటాయి కదా?
– ఎస్ఎస్రెడ్డి
(తిరుపతి)