దోశ తినగానే ఎందుకు నిద్ర వస్తుంది? దోశ మాత్రమే కాదు ఏదైనా మన శరీరానికి కావాల్సినదానికంటే ఎక్కువగా తింటే నిద్ర వస్తుంది. కాకుంటే దోశ తింటే మరికాస్త ఎక్కువగా నిద్రావహిస్తుంది.
పశువులు చూడండి రోజంజా మేస్తూనే ఉంటాయ్. రాత్రిపూట కూడా గడ్డి అయిపోతే మేత వెతుక్కుంటూ వెళ్ళిపోతాయ్. వాటికి కావాల్సిన పోషకాలు అవి తినే ఆహారంలో దొరకాలంటే ఎక్కువ క్వాన్టిటీ కావాలి.అసలు అది తిన్నదాంట్లో సగం ఖర్చు గడ్డిని వెతుక్కుంటూ నడవడంలోనూ తిన్న గడ్డిని రాత్రికి మళ్ళీ నోట్లోకి తెచ్చుకుని నెమరువేయడంలోనే ఖర్చయిపోతుందనుకుంటా.
పాములూ కొండచిలువలు వంటి సరీసృపాలు
ఇవి ఓ సారి దేన్నయినా మింగితే ఇక అంతే. అవి జీర్ణమయ్యే వరకూ మింగినచోటే పడుకుని హాయిగా నిద్రపోతాయ్. మొత్తం శక్తిని ఆరాయించుకోడానికి డైవర్ట్ చేస్తేగానీ కుదరని పరిస్థితి మరి. అందుకే మెటబాలిజం తగ్గిపోతుంది ఆ సమయంలో. ఇంతకీ దోశ కీ మెటబాలిజానికీ లంకె ఏమిటాని కదా?
దోశెల పిండిలో ఆ మెటబాలిజం జరుగుతుంది మరి.
దోశ ?
దోశ పిండి రుబ్బిన వెంటనే వేసుకుంటే అట్టు పెనానికి అంటుకుపోతుంది కానీ మన పళ్ళెంలోకి రాదు.
ఇలా జరక్కుండా దోశలు కరకరానో మెత్తగానో మన జిహ్వకు సరిపడేట్టు ఉండాలంటే పిండి కాస్త పులవాలి. దీన్ని సాంకేతికంగా ఇంగ్లీషులో ఫర్మెంటేషన్ అంటారు.
పులవటం – ఫర్మెంటేషన్ అంటే?
సూక్ష్మజీవులు చెక్కెరలను, పిండి పదార్థాలను (కార్బోహైడ్రేట్లు) అల్కాహాల్ క్రింద మార్చడం.
ఐతే ఇక్కడ అవి మన దోశెల పిండిని కాస్త కాస్తగా తిని లాక్టిక్ యాసిడ్ ని విసర్జిస్తాయన్నమాట.
మనకి అట్టు చక్కగా వేసుకోడానికి ఓ ఆరు గంటలు పులిస్తే చాలు .
సాధారణంగా ప్రాణవాయువు(ఆక్సిజన్) తక్కువగా ఉన్నప్పుడో అసలు లేనప్పుడో కణజాలం(ఇక్కడ సూక్ష్మ జీవులు) శక్తికోసం తమ వద్ద నిల్వ ఉన్న చెక్కెరలను వాడేస్తాయ్(దోశల పిండిని చక్కగా తిని). దీనిని అనెరోబిక్ రెస్పీరేషన్ అంటారు.
ఈ అనేరోబిక్ రెస్పీరేషన్ మనం కూడా చేస్తాము అందుకే అథ్లెట్స్ కురచ దుస్తులు ధరించేది.
పిండిని పెనం మీద వేసి తిప్పగానే వేడి తగిలి ఈ co2 అవిరైపోయి అలా అవిరైపోయిన చోట ఖాళీల్లో రంధ్రాలు ఏర్పడతాయ్.
ఈ సారి తక్కువ పులిసిన పిండితో వేసిన అట్టుకీ బాగా పులిసిన పిండితో వేసిన అట్టుపై ఏర్పడే రంధ్రాల్లో తేడాను గమనించండి. ఎక్కువ పులిసే కొద్దీ ఎక్కువ ఈథైల్ అల్కాహాల్ ఎక్కువ రంధ్రాలన్నమాట.
ఇదే ప్రక్రియ ఇడ్లీ డొకలా బ్రేడ్ వగైరాల్లో జరిగి రంధ్రాలు కనిపిస్తాయ్. పెరుగు,చీస్ వంటివాటిల్లో లాక్టో బాసిల్లస్ అనే బాక్టీరియా వల్ల ఈ ప్రక్రియ జరురుగుతుంది.
చలికాలం డిల్లీలో దోశలు మనం అస్సలు తినలేం. ఎందుకంటే అక్కడ చలి ఏ 6 డిగ్రీలో ఉంటుంది కనుక ఆ వాతావరణంలో పిండి పులిసి ఒదుగు రాదు, ఆ రుచి మనకు నచ్చకపోవచ్చు ,సిమ్లాలో ఎండాకాలమే తిన్నాను ఐనా అలానే ఉంది .
చాలా మంది బెజవాడ పుణుగుల రుచి హైదరాబాదులో రాదు అనటానికిక కూడా గాల్లో తేమ ఉష్ణోగ్రత కారణం అయ్యివుండవచ్చు. హోటల్ వారు ఉదయం రుబ్బిన పిండి ఆయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టీ అయా ప్రాంతాల వాతావరణాన్ని బట్టి అందులో సూక్ష్మక్రీముల యాక్టివిటీ ఉంటుంది .
ఇంతకీ దోశలు ఏ రకమైన ఆహారం?
ఆయుర్వేదం ప్రకారం ఆహారాలు మూడు రకాలు
సాత్వికం
రాజసికం
తామశికం
పిండి రుబ్బుకున్న మొదటిరోజు తింటే సాత్వికం అనుకుందాం
అపై రెండు మూడు రోజుల వరకూ రాజసికమైతే ఆపై తినే పుల్లట్లు తామశికం అని మా నాన్నగారు అంటారు.
కాస్త అల్కాహాల్ ప్రభావం ఉంటుందేమో మరి, అందుకే ఓ కవి పుల్లనీ పుల్లట్టు పంటికి అంటగానే చివచచ్చిన జన్మకే జీవమొచ్చెరా అని అన్నట్లున్నారు.
– సమీర్ ధర్మశాస్త వింజనంపాటి