– ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయొద్దు
– నూతనంగా ఎన్నికైన మార్కెట్ యార్డ్ చైర్మన్ మరియు సింగిల్ విండో అధ్యక్షులకు దిశా నిర్దేశం చేసిన మంత్రి సవిత
సోమందేపల్లి: పెనుకొండ నియోజకవర్గం సోమందేపల్లి సింగల్ విండో అధ్యక్షులుగా మాజీ చెరువు గ్రామానికి చెందిన పూల వెంకటేశ్వర్లు ఇస్లాపురం సొసైటీ అధ్యక్షుడు గా చంద్రగిరి పోతిరెడ్డి నియమితులయ్యారు.వానవోలు సింగల్ విండో అధ్యక్షులుగా వెంకటరమణ, బూదిలి సింగిల్ విండో అధ్యక్షుడిగా శంకర్ రెడ్డి నియమితులయ్యారు.
గోరంట్ల మండల మార్కెట్ యార్డ్ చైర్మన్ గా సోమందేపల్లి మండలం చెందిన శైలజ వెంకటేష్ నియమితులయ్యారు .ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో మంత్రి సవిత ని కలిసి ధన్యవాదములు తెలిపారు.ఈ సందర్భంగా తనను కలిసిన అధ్యక్షులకు ప్రజల అభివృద్ధికి బాధ్యతగా పనిచేయాలని మంత్రి సవిత సూచించారు.ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.